పట్టించుకోని పాలకులు. నీడ’కు నోచుకోని ఆళ్లగడ్డ నాలుగు రోడ్ల సర్కిల్.
AIMA న్యూస్ నంద్యాల జిల్లా. వేసవి కాలం వచ్చిందంటే చాలు ఆళ్లగడ్డ పట్టణంలోని నాలుగు రోడ్ల సర్కిల్ (బస్టాండ్ సమీపం) పరిస్థితి చూస్తుంటే అధికారులకు ప్రయాణికుల కష్టాలు పట్టడం లేదని స్పష్టమవుతోంది. నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులు, వాహనదారులు రాకపోకలు సాగించే ఈ కీలక ప్రాంతంలో కనీసం ఒక చలువ పందిరి కూడా లేకపోవడం గమనార్హం.
ఎండకు ఎండుతూ.. వడదెబ్బకు గురవుతూ.బస్సుల కోసం గంటల తరబడి వేచి చూసే ప్రయాణికులు ఎండ తీవ్రతకు అల్లాడిపోతున్నారు. మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలు నీడ కోసం సమీపంలోని దుకాణాల అరుగులను ఆశ్రయించాల్సి వస్తోంది. భానుడి భగభగలకు విలవిలలాడుతున్నారు.
మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ దారి గుండా వెళ్తున్నా, ప్రయాణికుల ఇబ్బందులు వారికి కనబడకపోవడం విచారకరం. నాలుగు రోడ్ల కూడలి, బస్టాండ్ ప్రాంతాల్లో చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తినా లేదా వడదెబ్బ తగిలినా దానికి పూర్తి బాధ్యత మున్సిపల్ యంత్రాంగమే వహించాల్సి ఉంటుంది. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్న అధికారులు, ప్రజల కష్టాలను తీర్చడంలో ఎందుకు వెనుకాడుతున్నారని పట్టణ వాసులు ప్రశ్నిస్తున్నారు.