యాదవులనుచిన్నచూపు చూస్తున్నప్రభుత్వాలు
నామినేటెడ్ పోస్టుల్లో యాదవులకుప్రాధాన్యం కల్పించాలి,
అఖిలభారత యాదవమహాసభ జిల్లాఅధ్యక్షులు ఎటి యాదవ్,
ప్రజావాయిస్ ఎల్లారెడ్డిపేట/ సిరిసిల్ల
నామినేటెడ్ పోస్టుల్లో యాదవులకు సమచిత ప్రాధాన్యం కల్పించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని అఖిలభారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు ఎ టి యాదవ్ అన్నారు ఎల్లారెడ్డిపేట అఖిలభారత యాదవ మహాసభ మండల అధ్యక్షులు గా రాగట్లపల్లి గ్రామానికి చెందిన మందాటి మల్లేష్ యాదవ్, ఎల్లారెడ్డిపేటకు చెందిన మానుక లక్ష్మణ్ యాదవ్ ల చేత స్థానిక సాయి శివ గార్డెన్లో అఖిలభారత యాదవ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి ఒగ్గు బాలరాజు యాదవ్ ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఎటి యాదవ్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో యాదవులు ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో రాణించేలా కృషి చేయాలని అన్నారు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో యాదవ భవన్, అదేవిధంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడలో రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో యాదవ సత్రం నిర్మించడానికి కృషి చేస్తానని అన్నారు అఖిలభారత యాదవ మహాసభ రాష్ట్ర నాయకులు బర్కం నవీన్ యాదవ్ మాట్లాడుతూ 559 జీవో ప్రకారం యాదవులకు ఐదెకరాల ప్రభుత్వ భూమి గొర్రెలు మేకలు పెంచుకోవడానికి స్థలం కేటాయించాలని సామూహిక గొర్ల దొడ్లు వేసుకోవడానికి స్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు అదేవిధంగా గీత, చేనేత వృత్తి కార్మికులకు 50 సంవత్సరాలకు ఇచ్చే పెన్షన్ సౌకర్యం యాదవులకు సైతం వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కరీంనగర్ లోని ప్రాథమిక గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం నూతనంగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల జిల్లాకు ప్రత్యేకంగా గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం ఏర్పాటు చేసేలా కృషి చేస్తామని వారు అన్నారు యాదవుల పిల్లలు చదువుకునేందుకు యాదవ హాస్టల్ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసేలా కృషి చేస్తామని వారు అన్నారు ఎల్లారెడ్డిపేట లో అసంపూర్తిగా మిగిలి ఉన్న యాదవ సంఘం భవన నిర్మాణం కోసం తమ వంతు కృషి చేస్తామని వారు అన్నారు ఎన్నికల్లో గెలుపొందిన ప్రజా ప్రతినిధులకు యాదవ సంఘం ఆధ్వర్యంలో శాలువా కప్పి ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో అఖిలభారత యాదవ మహాసభ వేములవాడ రూరల్ అధ్యక్షులు కొండవేని తిరుపతి యాదవ్, వేణుగోపాల్ యాదవ్, గంభీరావుపేట మండల యాదవ సంఘం అధ్యక్షులు దోమకొండ కృష్ణ కాంత్ యాదవ్, మాజీ ఎంపీపీ పిల్లి కిషన్ యాదవ్, రాగట్లపల్లి ఉప సర్పంచ్ మందాటి రాము యాదవ్,బొల్లు విశ్వం యాదవ్, చెరుకు ఎల్లయ్య యాదవ్, ధనాల ఎల్లయ్య యాదవ్,లంబ కుమార్ యాదవ్,పెద్దవేని రాజు యాదవ్ తో పాటు యాదవ కులానికి చెందిన మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.