సాలూరు లయన్స్ క్లబ్ స్కూల్ 10వ తరగతి ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలు
Aima Media News,సాలూరు:
సాలూరు టౌన్,పరిసర ప్రాంతాల లో లయన్స్ క్లబ్ స్కూల్ ఎంతో మంది గొప్ప వ్యక్తులని సమాజానికి అందించిన ఘన చరిత్ర కలిగిన గొప్ప పాఠశాల. ప్రపంచవ్యాప్తంగా లయన్స్ క్లబ్ సంస్థలు ఉన్నాయి...సాలూరు విద్యారంగంలో చెరగని ముద్ర వేసిన గొప్ప పాఠశాల.... 2026 10 వ తరగతి పరీక్షల ఫలితాలలో డబ్బీవీధి కి చెందిన టిడిపి నేత బృందావనం అశోక్ కుమార్,త్రివేణి ల ద్వితీయ పుత్రుడు బృందావనం సంపత్ కుమార్ 600 మార్కులకు గానూ 586 సాధించి స్కూల్ లో మొదటి స్థానం,బి.ఉన్నేషా శ్రీ 579 మార్కులు,డి.క్రాంతి కుమార్ 571, ఏ.చంద్ర శేఖర్ 571, కె జ్యోతి 563 మార్కులను సాధించారు. 500 కి పైగా మార్కులను మరో 24 మంది కైవసం చేసుకున్నారని, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ,అతి తక్కువ ఫీజుతో అత్యుత్తమ క్రమశిక్షణతో పాటు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులను సింహాల మాదిరి తీర్చిదిద్ది సమాజానికి అందిస్తున్న విద్యాసంస్థ అని స్కూల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సీహెచ్. చంద్రశేఖర్, స్కూల్ హెడ్మాస్టర్ ఆకుల అశోక్ కుమార్, అధ్యాపక సిబ్బంది తెలిపారు.