logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మాజీ మావోయిస్టుల ముఖ్య సమావేశం

*మాజీ మావోయిస్టుల ముఖ్య సమావేశం💥*

తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది మాజీ మావోయిస్టులు రేపు కార్మికుల దినోత్సవం సందర్భంగా ఒక ముఖ్య సమావేశం నిర్వహించనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.gathamlo మావోయిస్టు పార్టీలో పని చేసి లొంగిపోయిన వారు దాదాపు 100 మంది వరకు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే వీరు ఒక ప్రముఖ రాజకీయ నాయకుడితో పలు దఫాలుగా మంతనాలు జరిపినట్లు సమాచారం. రేపటి సమావేశం అనంతరం, రాజకీయ పరిణామాలలో భాగంగా వీరు ఒక రాజకీయ పార్టీలో చేరే అవకాశమున్నట్లు చర్చ జరుగుతోంది.

అయితే, దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ప్రస్తుతం ఇది కేవలం విశ్వసనీయ సమాచారం ఆధారంగా వచ్చిన సమాచారం మాత్రమే.

ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం ఉన్నందున, మరిన్ని వివరాలు అధికారిక ప్రకటన అనంతరం తెలియనున్నాయి.ఈ సమాచారాన్ని తెలుసుకున్న రాష్ట్ర నిఘా వర్గాలు ఆరా తీయడం మొదలు పెట్టాయి...

రాష్ట్ర చరిత్రలో మాజీ మావోయిస్టులు అందరూ కలిసి ఒకే వేదిక మీదకు చేరబోతున్నారన్న సమాచారంతో అటు పోలీసు వర్గాల్లో ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది

0
122 views

Comment