logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కౌతాళం మండలం పోదులకుంట - మదిరి గ్రామంలో ఘనంగా సామూహిక వివాహాలు*

*పేదవారికి సహాయం చేయడం చాలా సంతోషంగా ఉంది*
యువ నేత పాలకుర్తి దివాకర్ రెడ్డికౌతాళం మండలం పోదులకుంట - మదిరి గ్రామంలో ఘనంగా సామూహిక వివాహాలు*
శ్రీ శ్రీ ఉటకనూరు మరి బసవలింగ తాత మఠం నందు పంపారెడ్డి తాత అధ్వర్యంలో ప్రతి సంవత్సరం 51 ఉచిత వివాహాలు*

*ముఖ్య అతిథిగా హాజరై 51 తాళ్ళి ముత్తులు,51 జంతలు కాళ్ళి మేట్లు విరాళంగా ఇచ్చి నూతన దంపతులను ఆశీర్వదించిన పాలకుర్తి దివాకర్ రెడ్డి*పాలకుర్తి తిక్కారెడ్డి గారి కుటుంబానికి దేవుని కృప ఎల్లప్పుడు ఉండాలి అని పలు మఠం పీఠాధిపతులు ఆశీర్వదించారు*
పాలకుర్తి తిక్కారెడ్డి గారు ప్రతి సంవత్సరం సహాయం చేయడం తో గ్రామ పెద్దలు , యువకులు కృతజ్ఞత తెలియజేశారు*మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలం పోదులకుంట - మదిరి గ్రామంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఉటకనూరు శ్రీ మారి బసవలింగ తాత మఠం లో పంపారెడ్డి తాత అధ్వర్యంలో ఘనంగా సామూహిక వివాహాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం లాగే ప్రముఖ్య పారిశ్రామికవేత్త తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పాలకుర్తి తిక్కారెడ్డి గారు విరాళంగా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన పాలకుర్తి తిక్కారెడ్డి గారి తనయుడు తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి 51 జంటలకు తాళ్ళిముత్తులు, కాళ్ళు మేట్లు ఉచితంగా అందజేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం పాలకుర్తి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ నీరు పేదలకు సహాయం చేయడం చాలా సంతోషంగా ఉంది అని వారు అన్నారు. అనంతరం గ్రామ పెద్దలు, మఠం వారు పాలకుర్తి దివాకర్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలు మఠలు పీఠాధిపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి పాలకుర్తి తిక్కారెడ్డి గారు కుటుంబానికి దేవుని కృప ఎల్లప్పుడు ఉండాలి అని ఆశీర్వదించారు అనంతరం పాలకుర్తి దివాకర్ రెడ్డి గారిని శాలువా పూలమాలతో సన్మానించి ప్రసాదం అందజేసి ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చెన్నబసప్ప ధని, రవితేజ శేట్టి, కురుగోడు, సిద్దు,తదితరులు పాల్గొన్నారు

5
253 views

Comment