logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

10 ఫలితాలలో మరోసారి మండల టాపర్ గా ఎల్లావత్తుల ZPHS పాఠశాల.

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండలం ఎల్లావత్తుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి కి 2026 గురువారం నాడు విడుదల చేసిన 10 ఫలితాలలో మరోసారి మండల టాపర్ గా నిలిచింది. ఎల్లా వత్తుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి కుమ్మరి నాగ బాలాజీ అత్యుత్తమ ప్రతిభ కనపర్చి 582/600 మార్కులు సాధించి రుద్రవరం మండల టాపర్గా నిలిచాడని, గత సంవత్సర ఫలితాలలో జిల్లాస్థాయిలో 592 మార్కులు సాధించి తమ పాఠశాల ఉత్తమ ప్రతిభ కనబరిచిందని, తమ పాఠశాల తెలుగు సబ్జెక్టులో 98%, హిందీ 100%, ఇంగ్లీష్ 100%, మ్యాథ్స్ 98%, జనరల్ సైన్స్ 83%, సోషల్ 100% కనబరిచిందని, అలాగే పాఠశాల రెండవ స్థానం కమతం పవిత్ర 575/600,మూడవ స్థానం సదా సందీప్ 570/600 ఉత్తీర్ణత సాధించడం జరిగిందని, ఎల్లా వత్తుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలకృష్ణ తెలిపారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు.

103
4012 views

Comment