ఏపీసీఎన్ఎఫ్ మరియు ఆర్ఎస్కే సిబ్బందికి ఎల్‌నినో మరియు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ.
గోస్పాడు (AIMA MEDIA): రైతులకు సమగ్ర సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్న ఏపీసీఎన్ఎఫ్ మరియు ఆర్ఎస్కే సిబ్బందికి మంగళవారం మరియు బుధవారం రెండు రోజులపాటు ప్రత్యేక శిక్షణ మండల వ్యవసాయ అధికారి స్వప్నిక రెడ్డి మరియు APCNF మాస్టర్ ట్రైనర్ రామాంజనేయరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ శిక్షణలో ముఖ్యంగా ఎల్‌నినో ప్రభావాలు మరియు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పై అవగాహన కల్పించారు.ఎల్‌నినో కారణంగా వర్షపాతం లో వచ్చే మార్పులు, పంటలపై దాని ప్రభావం, ముందస్తు జాగ్రత్తలు వంటి అంశాలను నిపుణులు వివరిస్తూ, రైతులకు అందించాల్సిన సలహాలపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. అదేవిధంగా, ప్రకృతి వ్యవసాయం ద్వారా తక్కువ ఖర్చుతో, పర్యావరణానికి అనుకూలంగా, స్థిరమైన దిగుబడులు సాధించే విధానాలపై విశ్లేషణాత్మకంగా చర్చించారు.మరియు తొలకరి కి ముందు PMDS సాగు చేసి భూసారాన్ని పెంచి ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచించారు.విత్తన శుద్ధి మరియు విత్తన గుళికలు తయారీ డెమో ద్వారా తెలియజేశారు.