logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అక్రమ సంబంధం దాచి.. అబద్ధపు ఆరోపణలా సమీరా భర్త షేరు బాషా ఆగ్రహం.

నంద్యాల (AIMA MEDIA ): సుమారు 23 ఏళ్లపాటు కలిసి కాపురం చేసి, తన సర్వస్వాన్ని ఆమెకే ధారపోస్తే.. ఇప్పుడు కృతజ్ఞత లేకుండా తనపైనే ఎదురుదాడికి దిగుతోందని షేరు బాషా మండిపడ్డారు. బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన సమీరా బేగం వైఖరిని ఎండగట్టారు. పెళ్ళైన నాటి నుండి ఆమెను కంటికి రెప్పలా చూసుకున్నానని, నమ్మకంతో ఆస్తులన్నీ ఆమె పేరు మీదనే పెట్టానని గుర్తు చేశారు. అయితే, గత మూడు సంవత్సరాల క్రితం చిన్నపాటి కారణాలతో తనను వదిలి వెళ్ళిపోయి, హైదరాబాద్‌లో ఉంటూ తనకు తెలియకుండానే అక్రమ సంబంధం పెట్టుకుందని ఆరోపించారు. చట్టబద్ధంగా విడాకులు తీసుకోకుండానే మరో వ్యక్తిని వివాహం చేసుకుందని, ఇప్పుడు ఆ నిజాన్ని కప్పిపుచ్చుకోవడానికి తనపై వేధింపుల ముసుగులో తప్పుడు ఫిర్యాదులు చేస్తోందని ధ్వజమెత్తారు. అసలు బాధితుడిని తానేనని, తన ఆస్తిని కాజేసేందుకు ఆమె ఆడుతున్న నాటకాలను ఎవరూ నమ్మవద్దని కోరారు. తనను మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్న సమీరా బేగంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తన పిల్లలకు, తనకు రక్షణ కల్పించాలని ఆయన పోలీసు యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు. ఒక పక్క ఆస్తి కాజేసి, మరోపక్క అక్రమ సంబంధాలు పెట్టుకుని సమాజంలో తనను దోషిగా నిలబెట్టాలని చూడటం ఆమె విచక్షణకే వదిలేస్తున్నానని బాషా ఆవేదన వ్యక్తం చేశారు.

3
729 views

Comment