డీఎస్పీగాపదోన్నతి పొందినవెంకటేశ్వర్లు
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి
సీఐ వెంకటేశ్వర్లు కు డీఎస్పీగా పదోన్నతి
తమదైన శైలిలో సేవలందిస్తూ ప్రజల మన్ననలు పొందిన సీఐ వెంకటేశ్వర్లు పదోన్నతి పొందారు డీఎస్పీగా ప్రమోషన్ పొందుతూ ఉత్తర్వులు అందుకున్నారు
కరీంనగర్ ఉమ్మడి జిల్లా మానకొండూరు మండలానికి చెందిన ఆయన1996 బ్యాచ్ కు చెందిన వెంకటేశ్వర్లు ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో 2007 నుండి 2010 సంవత్సరంలో ఎస్సైగా పనిచేశారు వివిధ పోలీస్ స్టేషన్లో సమర్థవంతంగా పనిచేసి సీఐగా ప్రమోషన్ పొందారు వివిధ స్టేషన్లో సిఐగా పనిచేస్తూ 2024 నుండి ఇప్పటివరకు చందుర్తి సిఐగా పని చేశారు శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించారు కేవలం విధి నిర్వహణలోనే కాకుండా, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో ఆయన ఈ ప్రాంత ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఆయన పదోన్నతి పట్ల ఆయా మండలాల ప్రజా ప్రతినిధులు, పోలీస్ సిబ్బంది స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.