10వ తరగతి 100/100 ఉత్తీర్ణత సాధించిన సెయింట్ జోసెఫ్ హై స్కూల్, ..
అభినందించిన పాఠశాల ప్రిన్సిపాల్ బ్రదర్ రాజశేఖర్ రెడ్డి
SSC 2025–26 ఫలితాల్లో నూటికి నూరు శాతం విజయాన్ని సాధించిన సెయింట్ జోసెఫ్ పాఠశాల
ఈరోజు విడుదలైన తెలంగాణ SSC 2025–26 ఫలితాల్లో సెయింట్ జోసెఫ్ హై స్కూల్, రుద్రంపూర్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ సంవత్సరం పాఠశాల 100% ఉత్తీర్ణత సాధించి విశేష గౌరవాన్ని అందుకుంది.టాప్ విద్యార్థులు: 1️⃣ G. Bhargava Aditi – 566/600
2️⃣ Md. Sohail Karim – 554/600
3️⃣ Jannathul Firdos – 549/600
4️⃣ Jasmitha – 547/600
5️⃣ Riyan – 546/600 ముఖ్య విశేషాలు: 👉 29 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించి పాఠశాల ప్రతిష్టను మరింతగా పెంచారు.గత మూడు సంవత్సరాలుగా వరుసగా నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధిస్తూ రికార్డులు సృష్టిస్తోంది.
గత సంవత్సరాలతో పోలిస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధించి, అన్ని పాఠశాలల్లో ముందంజలో నిలిచింది సెయింట్ జోసెఫ్ పాఠశాల.ఈ విజయానికి కారణంగా అత్యాధునిక విద్యా విధానాలు
ఉత్తమ అకాడమిక్ ప్రణాళిక అధ్యాపకుల అంకితభావంతో కూడిన కృషి ముఖ్య పాత్ర పోషించాయని పాఠశాల ప్రిన్సిపాల్ బ్రదర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.