కలంపై కత్తి దాడి: జర్నలిస్ట్ హత్యపై భగ్గుమన్న ఆళ్లగడ్డ మీడియా వర్గాలు.
AIMA న్యూస్ నంద్యాల జిల్లా.చిత్తూరు జిల్లా వీ.కోట ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యను నిరసిస్తూ ఆళ్లగడ్డ తాలూకా వర్కింగ్ జర్నలిస్టులు (ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా) బుధవారం నాడు ఆళ్లగడ్డ మండల డిప్యూటీ తహసిల్దార్ లక్ష్మీదేవికి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ క్షేత్రస్థాయి సమస్యలను వెలుగులోకి తెచ్చే జర్నలిస్టులపై ఇలాంటి దాడులు జరగడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యకు పాల్పడిన నిందితులను తక్షణమే గుర్తించి, చట్టపరంగా కఠినంగా శిక్షించాలని నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడే జర్నలిస్టులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. జర్నలిస్టులపై ఇలాంటి దాడులు అత్యంత బాధాకరం. విధి నిర్వహణలో ఉన్న విలేఖరిని దారుణంగా హత్య చేయడం చూస్తుంటే సామాజిక స్పృహ ఉన్న వారు ఎవరైనా కలత చెందుతారు. ప్రభుత్వం ఈ కేసును వేగవంతం చేసి నిందితులకు తగిన గుణపాఠం చెప్పాలని తెలిపారు.జర్నలిస్టుల విజ్ఞప్తిపై స్పందించిన డిప్యూటీ తహసిల్దార్ లక్ష్మీదేవి, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు మరియు వివిధ పత్రికల విలేఖరులు
ముల్లా ఖాదర్ భాష (ఆంధ్రజ్యోతి)
సర్దార్ (ఈనాడు)
నిజాముద్దీన్ (ప్రజాశక్తి)
ఇస్మాయిల్ బేగ్ (విశాలాంధ్ర)
ప్యాపిలి ప్రసాద్, అక్షింతల శ్రీనివాసులు, నిజాముద్దీన్, అరుణ్
ఓబుల్ కిరణ్ (వార్త)
సుబ్బయ్య, రమేష్, సునీల్ తదితరులు ఉన్నారు.