భక్తుల సౌకర్యార్థం ధర్మకర్తల మండలి సమావేశంలో 15 అంశాలను ఆమోదించడమైనది. చైర్మన్ రమేష్ నాయుడు.
*ధర్మకర్తల మండలి సమావేశం*
ఈ రోజు (28.04.2026) దేవస్థానం ధర్మకర్తల మండలి 6వ సమావేశం నిర్వహించబడింది. కార్యాలయ భవనములోని మీటింగ్ హాల్ నందు ఈ ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించబడింది. కాగా సమావేశంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, సభ్యులు బోడేపూడి వెంకటసుబ్బారావు, శ్రీమతి జవ్వాజి రేఖాగౌడ్, వీడియోకాన్ఫరెన్సు ద్వారా పాల్గొన్నారు.కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, తక్కిన పలువురు సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు ప్రత్యక్షంగా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సమావేశంలో మొత్తం 22 అజెండా అంశాలు చర్చించబడ్డాయి. వీటిలో 15 అంశాలు ఆమోదించబడ్డాయి. తక్కిన వాటిలో 5 అంశాలు వాయిదా వేయడం జరిగింది. మిగిలిన 2 అంశాలు తిరస్కరించబడ్డాయి.
సమావేశం ప్రారంభంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు మాట్లాడుతూమౌలికసదుపాయాల కల్పనపై ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు. అదేవిధంగా క్షేత్రాభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోబడుతాయన్నారు. ముఖ్యంగాభక్తులరద్దీకనుగుణంగా ఆయా ఏర్పాట్లను చేయడం జరుగుతుందన్నారు. భక్తుల నుంచి పూర్తిస్థాయి సంతృప్తి వచ్చేవిధంగా ఆయా ఏర్పాట్లను చేయడం జరుగుతుందన్నారు.
•కాగా సమావేశంలో క్షేత్రపరిధిలో భక్తులరద్దీకనుగుణంగా గుర్తించిన మొత్తం 20 ప్రదేశాలలో బి.ఓ.టి పద్దతిన అన్ని సౌకర్యాలతో శాశ్వత శౌచాలయాల ప్రాంగణాలను ( పర్మనెంట్ పబ్లిక్ టాయిలెట్స్) నిర్మించాలని తీర్మానించడం జరిగింది. రాబోవు 6మాసాలలోగా ఈ పని పూర్తి చేయాలని నిర్ణయించడమైనది.
•టోల్‌గేట్ సమీపం నుంచి కుమారసదనం వరకు రూ. 24లక్షల వ్యయంతో సి.సి రోడ్డు నిర్మించాలనితీర్మానించడమైనది.
•వర్కుషాపు నుంచి పాతాళగంగ పాతమెట్ల వరకు రూ. 36,50,000 లక్షల అంచనా వ్యయంతో అండరు గ్రౌండ్ డ్రైనేజీ బైపాస్ పనులు చేపట్టుటకు తీర్మానించడమైనది.
•దేవస్థానం గో సంరక్షణశాలలో గోవులకు అవరమైన వరిగడ్డి మరియు పచ్చిగడ్డి సరఫరాకు సంబంధించిన టెండరును ఆమోదించడమైనది.
•సిద్ధరామప్ప షాపింగ్ కాంప్లెక్సు నందు బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు నూతన శాఖను ఏర్పాటు చేసుకొనుటకు ఆమోదాన్ని తెలపడం జరిగింది.
ఇంకా సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. రోజురోజుకు పెరుగుతున్న భక్తులరద్దీకనుగుణంగా క్యూకాంప్లెక్సునిర్మాణాన్ని త్వరలో చేపట్టాలని నిర్ణయించబడింది.
అదేవిధంగా సామాన్య భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకు క్షేత్రపరిధిలో పలుచోట్ల ఉన్న ప్రస్తుతడార్మిటరీలనుఆధునీకరించడంతో పాటు నూతనంగా మరిన్ని డార్మిటరీలను నిర్మించేందుకు చర్యలు చేపట్టాలనినిర్ణయించబడింది.పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాబోవు వర్షాకాలంలో క్షేత్రపరిధిలో పలుచోట్ల కనీసం ఆరువేల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగింది.