logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

స్వామి వారి భక్తులకు సెల్ఫ్ సర్వీస్ కియోస్కో మిషన్ లు ఏర్పాటు.



*సెల్ఫ్ సర్వీస్ కియోస్క్ మిషన్ల ఏర్పాటు*

భక్తుల సౌకర్యార్థమై దేవస్థానం పలుచోట్ల సెల్ఫ్ సర్వీస్ కియోస్క్ మిషన్ల ఏర్పాటు చేసింది. లడ్డూ ప్రసాదాల విక్రయకేంద్రం వద్ద ఏర్పాటు చేసిన కియోస్క్ మిషన్లు ఈ రోజు ( 28.04.2026) సాయంత్రం దేవస్థానం కార్యనిర్వహణాధికారి మరియు ధర్మకర్తల మండలి సభ్యులు ప్రారంభించారు.
ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి ముందుగా పూజాదికాలను జరిపి ఈ సెల్ఫ్ సర్వీస్ కియోస్క్ మిషన్లను ప్రారంభించడం జరిగింది.
ఈ సెల్ఫ్ సర్వీస్ కియోస్క్ ద్వారా భక్తులు దర్శనాలు, ప్రసాదాలు మరియు కేశఖండన టికెట్లను పొందవచ్చు. అదేవిధంగా దేవస్థాన వివిధ పథకాలకు వీటి ద్వారా విరాళాలను కూడా చెల్లించవచ్చు.కాగా కేంద్ర విచారణ కార్యాలయం ( సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్), మల్లికార్జునసదన్, గంగాసదన్, కల్యాణకట్ట, పాత విరాళాల కేంద్రం మరియు గంగాధర మండపం వద్దగల కొత్త విరాళాల కేంద్రం వద్ద కూడా సెల్ప్ సర్వీస్ కియోస్క్ మిషన్లు ఏర్పాటు చేయబడ్డాయి.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మరియు ధర్మకర్తల మండలి సభ్యులు మాట్లాడుతూ భక్తులకు సాంకేతికతో కూడిన మరింత మెరుగైన సేవలను అందించడంలో భాగంగా ఈ కియోస్క్ మిషన్లను పలుచోట్ల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీటి ద్వారా భక్తులు ఆయా టికెట్లను ఎవరికివారు నేరుగా పొందవచ్చునన్నారు.ఈ ఏర్పాట్ల వలను భక్తులు ఆయా టికెట్లను సులభతరంగా పొందే అవకాశం కలుగుతుందన్నారు.
కాగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన మనమిత్ర వాట్సప్ ద్వారా దేవస్థానమునకు సంబంధించిన 17 రకాల టికెట్లను ముందస్తుగా పొందే అవకాశం కల్పించబడింది.
అదేవిధంగా దేవస్థానం అధికారిక వెబ్‌సైట్ www.srisailadevasthanam.org మరియు దేవదాయశాఖ వెబ్‌సైట్ www.aptemples.ap.gov.in ద్వారా కూడా దర్శనం,
ఆర్జితసేవాటికెట్లను ముందస్తుగా పొందవచు కాగా ఈ కియోస్క్ మిషన్లను కరూర్ వైశ్యబ్యాంకు వారు కార్పోరేట్ సామాజిక బాధ్యత క్రింద దేవస్థానానికి అందజేయడం జరిగింది.

17
3451 views

Comment