logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

*ఫలితం ఏదైనా బిడ్డలను అక్కున చేర్చుకోండి... మార్కులు జీవితాన్ని శాశించలేవు *





_పదవ తరగతి ప‌రీక్షా ఫలితాల నేపథ్యంలో విద్యార్థినీ విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు నాదొక విన్నపం._

_ఈ ఫలితాలు మీ జీవిత గమనాన్ని శాసించేవి కావు, మీ సుదీర్ఘ ప్రయాణంలో ఇదొక చిన్న మలుపు మాత్రమేనని గుర్తించండి._

_ఇటీవలి ఇంటర్మీడియట్ ఫలితాల తర్వాత కొన్ని నిండు ప్రాణాలు అర్ధాంతరంగా గాలిలో కలిసిపోవడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. మార్కులు తక్కువ వచ్చాయని లేదా విఫలమయ్యామని ప్రాణాలు తీసుకోవడం ఏ సమస్యకూ పరిష్కారం కాదు, అది మీ కుటుంబాలకు తీరని శోకాన్ని మాత్రమే మిగులుస్తుంది._

_ఓటమి అనేది గెలుపుకు తొలిమెట్టు కావాలే తప్ప, జీవితానికి ముగింపు కాకూడదని ప్రతి విద్యార్థి గుర్తుంచుకోవాలి._

_ముఖ్యంగా తల్లిదండ్రులకు ఒక మనవి... మీ ఆశలను, అంచనాలను పిల్లలపై భారంగా మోపి వారిని ఒత్తిడికి గురిచేయకండి. ఫలితం ఏదైనా సరే, మీ పిల్లలను ప్రేమగా అక్కున చేర్చుకోండి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపండి._

_మార్కుల కంటే మీ పిల్లల ప్రాణం, వారి చిరునవ్వు మీకు అత్యంత ముఖ్యం. ఫలితాల తర్వాత పిల్లల ప్రవర్తనను నిశితంగా గమనించండి; వారు ఒంటరిగా ఉన్నా, మౌనంగా ఉన్నా వారి వెన్నంటి ఉండి ధైర్యం చెప్పండి. అవసరమైతే మీ పనులన్నీ పక్కన పెట్టి, ఒక రోజంతా వారితో గడిపి, వారి మనసులోని భయాన్ని పోగొట్టండి._

_ఉపాధ్యాయులు కూడా ఈ సమయంలో విద్యార్థులతో సంభాషించి, ఫెయిల్యూర్ అనేది తాత్కాలికమేనని, భవిష్యత్తులో ఎన్నో అవకాశాలు ఉంటాయని భరోసా కల్పించాలి._

_చదువులో వెనుకబడిన ఎందరో వ్యక్తులు పట్టుదలతో శ్రమించి నేడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్థాయికి చేరుకున్నారన్న నిజాన్ని ఎవరూ మరువవద్దు._

_పరీక్షల కంటే ప్రాణం గొప్పది, మీ వెనుక ఒక కుటుంబం ఉందని, మీ కోసం వారు తపిస్తున్నారని ఆలోచించండి._

_ఏ చిన్న ఆందోళన కలిగినా మీ తల్లిదండ్రులతో లేదా ఆత్మీయులతో పంచుకోండి. ప్రతికూల ఫలితాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను: సీపీ సజ్జనార్_

0
0 views

Comment