logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మీ జేబుకు చిల్లు పడకుండా ప్రాణం నిలబెట్టే దేవాలయమే*ఎయిమ్స్ (ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్) బిబి నగర్ హాస్పిటల్ **స్పెషలిస్ట్ డాక్టర్ల ఫీజు కేవలం 10 ₹

*మీ జేబుకు చిల్లు పడకుండా, ప్రాణం నిలబెట్టే దేవాలయం: బీబీనగర్ ఎయిమ్స్*

*స్పెషలిస్ట్ డాక్టర్ల ఫీజు కేవలం 10 రూపాయలే,

*"అమ్మా, ఆపరేషన్‌కు 5 లక్షలు కావాలి" అనే మాట ఇక వినబడదు. ఎందుకంటే మన బీబీనగర్ లో తెలంగాణ లో ఎయిమ్స్ ఉంది.*

ఒక పేద తండ్రి కూతురి పెళ్లి కోసం దాచిన డబ్బు, ఒక తల్లి కొడుకు చదువు కోసం కూడబెట్టిన సొమ్ము – ఒక్క జబ్బు పేరు చెప్పి కార్పొరేట్ హాస్పిటల్ లాగేసుకుంటుంది. ఇక ఆ బాధలు వద్దు.

*హైదరాబాద్ - యదాద్రి మధ్య, 200 ఎకరాల పచ్చని ప్రాంగణంలో, కేంద్ర ప్రభుత్వం రూ. 2000 కోట్లతో కట్టించిన మన ఎయిమ్స్* మనందరి కోసం ఎదురుచూస్తోంది.

*మీరు ఎందుకు వెంటనే వెళ్లాలి?
ఇది చదవండి, మీ కళ్ళు మీరే నమ్మరు.*

*1. డాక్టర్ ఫీజు ఎంత అంటే – ఒక్క టీ ఖరీదు కూడా కాదు: కేవలం ₹10/-*

అవును సార్, కేవలం పది రూపాయలు. ఆ ఒక్క టికెట్‌తో మీరు జనరల్ ఫిజీషియన్ దగ్గర, కీళ్ల డాక్టర్ దగ్గర, కంటి డాక్టర్ దగ్గర, ENT డాక్టర్ దగ్గర, పంటి డాక్టర్ దగ్గర, చర్మవ్యాధుల డాక్టర్ దగ్గర – అందరి దగ్గరా చూపించుకోవచ్చు.

*బయట ఒక స్పెషలిస్ట్ ఫీజు ₹500 నుండి ₹1500. ఇక్కడ మాత్రం ₹10.* ఆలోచించండి, మీ 490 రూపాయలు మిగిలినట్టే.

*2. బయట ₹10,000 అయ్యే టెస్టులు ఇక్కడ ₹600 లోపే*

మీరు షాక్ అవుతారు, కానీ ఇది నిజం. కార్పొరేట్ హాస్పిటల్ బిల్లు చూసి గుండె ఆగిపోయే పరిస్థితి ఇక్కడ ఉండదు.
మీకు బయట అయ్యే ఖర్చు ఎయిమ్స్‌లో అయ్యే ఖర్చు మీకు మిగిలేది
కంప్లీట్ బ్లడ్ టెస్ట్: ₹800 ₹135 ₹665
లివర్ & కిడ్నీ టెస్ట్: ₹2000 ₹225 + ₹225 ₹1550
ECG + చెస్ట్ X-Ray: ₹700 ₹50 + ₹60 ₹590
థైరాయిడ్ టెస్ట్: ₹900 ₹200 ₹700
మామ్మోగ్రఫీ: ₹4000 ₹630 ₹3370
*ఒక్కరోజులో ₹6000 కు పైగా ఆదా.* ఆ డబ్బుతో మీ పిల్లలకు ఒక నెల సరుకులు వస్తాయి సార్.

*3. ఇది హాస్పిటల్ కాదు, ఫైవ్ స్టార్ హోటల్లాగావుంటుంది*

200 ఎకరాల్లో పచ్చదనం మధ్య ఉన్న హాస్పిటల్. గాలి, వెలుతురు, పరిశుభ్రత. బాత్‌రూమ్ నుండి బెడ్ వరకు అద్దంలా మెరుస్తూ ఉంటుంది. క్యాంటీన్‌లో వేడి వేడి అన్నం, కూర, పప్పు, పెరుగు అన్నీ కలిపి *కేవలం ₹75.* బయట హోటల్లో ఒక ప్లేట్ మీల్స్ కూడా రాదు ఈ రేటుకి.

*4. వెళ్లడం చాలా ఈజీ – జేబుకు భారం కాదు*స్రిలు ఫ్రీ.బస్సు పురుషులు
Uppal to -బీబీనగర్, 50.00 gents fare

స్రీలు ఉచితబస్సు
వరంగల్ బస్ స్టాండ్ నుండి హైదరాబాద్ డైరెక్ట్ బస్సులు బీబీనగర్ ఎయిమ్స్ 150.00

ఉదయం 7గంటలకు వెళ్తే, టెస్టులతో సహా అన్నీ అయిపోయి మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికి వచ్చేస్తారు. ఆఫీసుకు సెలవు పెట్టాల్సిన పని లేదు.
750 బెడ్స్. 250 ఎమర్జెన్సీ బెడ్స్
1000 మంది డాక్టర్లు – మీ కోసమే*

మనలాంటి సామాన్యులకు వైద్యం అందాలని 24 గంటలు అంకితభావంతో పనిచేస్తున్నారు.
దేశం లో నుండి ఎక్కడ నుంచి వచ్చినా సరే, ఆధార్ కార్డు ఉంటే చాలు. తెలుగులోనే మాట్లాడతారు, ప్రేమగా ట్రీట్‌మెంట్ ఇస్తారు.

*ఇంకా ఆలోచిస్తున్నారా?*

మీ పక్కింటి వాళ్లు, మీ బంధువులు, మీతో పనిచేసే తోటి వర్కర్స్ – ఎవరైనా జబ్బుతో బాధపడుతున్నారా? లక్షలకు లక్షలు అప్పు చేస్తున్నారా? వెంటనే ఈ మాట చెప్పండి: *"ఒక్కసారి బీబీనగర్ ఎయిమ్స్ కీ వెళ్లిరాoడి ."*

మీరు ఫార్వర్డ్ చేసే ఈ ఒక్క మెసేజ్ ఒక కుటుంబాన్ని అప్పుల ఊబి నుండి బయటకు లాగవచ్చు. ఒక తల్లి కన్నీళ్లు తుడవవచ్చు. ఒక నాన్న గుండె ధైర్యం నింపవచ్చు.

*ఇది కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్ అని చులకన చేయకండి. ఇది మన ఆస్తి. మన కోసం కట్టిన ప్రపంచ స్థాయి హాస్పిటల్. దీన్ని పూర్తిగా వాడుకుందాం.*

*అడ్రస్:* ఎయిమ్స్ హాస్పిటల్, బీబీనగర్ హైదరాబాద్ (200 Acres)
*ఓపీ టైమ్:* ఉదయం 9 నుండి. టికెట్ ₹10.
aimsbibinager.edu. in online booking fecility
08685293300
08685295050
Am 9-5pm

*ఈరోజే మీ ఫోన్‌లోని 10 గ్రూపులకు పంపండి. పుణ్యం మీకు, మేలు 10 మందికి.*

*ఇట్లు,*
*మీ శ్రేయోభిలాషి*

86
4650 views

Comment