logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

భక్తుల జేజేల మధ్య బ్రహ్మరథోత్సవం

భక్తుల జేజేల మధ్య బ్రహ్మరథోత్సవం

పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు

ముఖ్యఅతిథిగా హాజరైన శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ ,ఆర్డిఓ చంద్రమోహన్

టెంకాయ కొట్టి ప్రారంభించిన మఠాధిపతులు శ్రీశ్రీశ్రీ వీర ధర్మ జ వెంకటాద్రి స్వాములవారు

బ్రహ్మంగారిమఠం ఉదయం ప్రతినిధి

త్రికాలజ్ఞాని జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారి 33వ ఆరాధన గురు పూజ మహోత్సవాలు అత్యంత వైభవ్వేతంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా సోమవారం సాయంత్రం పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తాదుల జేజేల మధ్య బ్రహ్మరథోత్సవం కొనసాగుతుంది మొదటగా ఇటీవల కాలంలో నూతన మఠాధిపతిగా పదవి చేపట్టిన మఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ వీరధర్మజ వెంకటాద్రి స్వాములవారు లాంచనంగా బ్రహ్మ రథోత్సవానికి టెంకాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి బ్రహ్మ రథోత్సవాన్ని భక్తుల మధ్య ప్రారంభించారు. అంతకుముందు ఈశ్వరి దేవి మఠం మఠాధిపతి శ్రీశ్రీశ్రీ శివకుమార్ స్వాముల వారు భక్తుల మధ్య తరలివచ్చి బ్రహ్మరథోత్సవానికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి హారతులు సమర్పించే టెంకాయ కొట్టి లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు బ్రహ్మంగారిమఠం మఠాధిపతులు శ్రీశ్రీశ్రీ వెంకటాద్రి స్వాముల వారిని తాళ్లమేల వాయిద్యాల మధ్య బ్రహ్మరథం దగ్గరికి భక్తుల జేజేలు మధ్య తీసుకొచ్చారు. ఈ బ్రహ్మ రథోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ తో పాటు, బద్వేల్ ఆర్డీవో చంద్రమోహన్, భీమటం తహసిల్దార్ కార్తీక్, మైదుకూరు డిఎస్పి రాజేంద్రప్రసాద్, రూరల్ సిఐ శివశంకర్ యాదవు లు హాజరై రధానికి పూజలు నిర్వహించడంతోపాటు, వారు టెంకాయలు కొట్టి ప్రారంభించారు. ఈ బ్రహ్మ రథోత్సవ కార్యక్రమాన్ని భక్తాదులు తిలకించేందుకు కోసం తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఉండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చి బ్రహ్మంగారిమఠం పురవీధుల నుండే కాకుండా మిద్దెల మిద్దెలు మేడల పై నుండి తనివి తీర బ్రహ్మ రథోత్సవ కార్యక్రమాన్ని వీనుల విందుగా తిలకిస్తూ పులకించారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. బ్రహ్మరథోత్సవం జరుగుతున్న మోడవీధులలోకి ఇటువంటి వాహనాలు రాకుండా రథోత్సవ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు కోసం పోలీసు వారు ముందస్తుగా మాడవీధులనుంచి లోకి వచ్చే రహదారుల వెంట భారీ ఎత్తున భారీ కేట్లను ముందస్తుగా ఏర్పాటు చేశారు బ్రహ్మ రథాన్ని చూసేందుకు వేలాదిగా తరలివచ్చిన భక్తజనులు జేజేల మధ్య బ్రహ్మరథం ఆనందంగా కొనసాగింది ఇటువంటి ప్రమాదాలు లేకుండా భక్తులు గొలుసులు పట్టుకొని ప్రధాని లాగుతూ జై వీర బ్రహ్మ జై గోవింద మాంబజై అనే నినాదాలతో జేజేలు పలుకుతూ రధాన్ని భక్తులు లాగారు. మట ముఖ ప్రాంగణం నుండి మొదలైన బ్రహ్మరథం మాడవీధులకుండా భక్తుల జేజేల మధ్య ఎక్కడి నుంచి బ్రహ్మరథం కదిలిందో యధా స్థానానికి చేరుకునేంతవరకు వేలాదిగా తరలివచ్చిన భక్తులు జేజేలు పలుకుతూ వాటి మధ్య భ్రమరాతోత్సవం వైభవంగా కొనసాగి యధా స్థానానికి చేరుకోవడంతో మటన్ నిర్వాహకులు అదేవిధంగా పోలీస్ సిబ్బంది అధికారులు రెవెన్యూ అధికారులు భక్తులు అద్భుతంగా కార్యక్రమం జరిగిందని ఊపిరి పీల్చుకున్నారు. రథం లాగుతున్నంతసేపు మైకులలో భక్తులకు విజ్ఞప్తి చేస్తూ ఎవరు ప్రధానికి అడ్డుపడకూడదని ఎటువంటి ఇబ్బందులు శిక్షించకుండా రథోత్సవం బాగా జరిగే లాగా ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ప్రధాని లాగుతూ ఎక్కడి నుంచి అయితే రధాన్ని ముందుకు లాగరో అదే స్థానంలోకి బ్రహ్మరధాన్ని చేర్చడంతో సవ్యంగా జరిగిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తాదులు స్వామివారి రథోత్సవాన్ని కనులారా తిలకించి స్వామివారికి కార్యకర్తలు చెల్లించి రథోత్సవం ముగియడంతో తిరుగు ప్రయాణానికి బస్సుల వైపు దిగబడుతూ వారి వారి స్వగ్రామాలకు చేరుకునేందుకు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ బ్రహ్మ రథోత్సవ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు మండల పరిషత్ అధ్యక్షులు చిలేఖాంపల్లి వీరనారాయణరెడ్డి, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు చెన్నుపల్లి సుబ్బారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కానాల మల్లికార్జున్రెడ్డి, సాంబశివారెడ్డి, సుధాకర్, పూజ శివ, అంకిరెడ్డిపల్లి రామ సుబ్బారెడ్డి నారాయణ యాదవ్, పోల్ రెడ్డి, ఎస్సార్ శ్రీనివాస్ రెడ్డి లతోపాటు,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ,భారతీయ జనతా పార్టీ ,సిపిఐ, సిపిఎం తదితర అన్ని రాజకీయ పార్టీల నాయకులతో పాటు కార్యకర్తలు వివిధ విద్యార్థి సంఘాల నేతలు, ప్రజాసంఘాల నాయకులు, అధికారులు తదితరులతోపాటు మఠం మేనేజర్ ఈశ్వర చారి, ఇతర మఠం సిబ్బంది, ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు: మేనేజర్ ఈశ్వర చారి
బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలకు సహకరించిన పోలీసు రెవిన్యూ పంచాయతీరాజ్ అగ్నిమాపక శాఖ విద్యుత్ శాఖ మొదలగు అన్ని శాఖల అధికారులకు అలాగే అన్ని రాజ్య సహకరించిన అన్ని రాజకీయ పార్టీల నేతలకు ఉత్సవాలకు తరలివచ్చి సహకరించిన భక్తులందరికీ పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు బ్రహ్మంగారిమఠం మేనేజర్ ఈశ్వర చారి కృతజ్ఞతలు తెలిపారు.

1
57 views

Comment