కామారెడ్డి జిల్లా బాన్సువాడ్ లో ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్
బాన్సువాడ పట్టణంలో సోమవారం బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడినాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి ఆదేశానుసారం,మాజీ ఎమ్మెల్యే బాజీ రెడ్డి గోవర్ధన్ గారి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ జెండాను ఘనంగా ఎగురవేసి,పార్టీ స్థాపకుడు,మాజీ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) గారికి నివాళులు అర్పించారు.అనంతరం తెలంగాణ అమరవీరులకు, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారికి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అలాగే పట్టణంలోని పలు వార్డుల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించి స్వీట్ లు పంచడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు,మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్ర సాధనలో బిఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని,ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.2001 ఏప్రిల్ 27న శ్రీ కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీని స్థాపించి, తెలంగాణ ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు పోరాటాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు
ఈ వేడుకల్లో పార్టీ నాయకులు కామారెడ్డి జిల్లా మాజీ రైతు బంధు అధ్యక్షులు అంజిరెడ్డి, ఏఐబిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బోడ చందర్, మాజీ జడ్పీటీసీ రత్న కుమార్, బిఆర్ఎస్వి మాజీ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబా, కౌన్సిలర్లు ఫెరోజ్ ఖాన్, ఖలీల్ ఖాన్, మాక్బూల్, మాజీ కౌన్సిలర్ బాడి శ్రీనివాస్, అక్బర్, మైనారిటీ సెల్ నాయకుడు ఇషాక్, నాయకులు రమేష్ యాదవ్, అందె రాజు, ఉబెద్, గంగారాం, కృష్ణ,మహేష్, శివ సూరి,జావీద్, రజాక్, ఖాలెత్,అంజి తదితరులు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.