వరంగల్ నగరంలోని దేశాయిపేట రోడ్డులో ఉన్న ఓయాసిస్ హై స్కూల్‌లో ఈరోజు డాన్ బోస్కో నవజీవన్ వరంగల్ సంస్థ ఆధ్వర్యంలో “అడోలెసెంట్ పార్లమెంట్” పిల్లల కోసం
వరంగల్ నగరంలోని దేశాయిపేట రోడ్డులో ఉన్న ఓయాసిస్ హై స్కూల్‌లో ఈరోజు డాన్ బోస్కో నవజీవన్ వరంగల్ సంస్థ ఆధ్వర్యంలో “అడోలెసెంట్ పార్లమెంట్” పిల్లల కోసం 5 రోజుల లైఫ్ స్కిల్స్ శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి డాన్ బోస్కో నవజీవన్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ శ్రీ సంతోష్ కుమార్ అధ్యక్షత వహించారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వరంగల్ యునైటెడ్ జిల్లాలో మాజీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ మరియు చైల్డ్ అడ్వకసీ ఫోరం కన్వీనర్ శ్రీ మండల పరశురాములు గారు హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి పిల్లవాడు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు సమాజంలోని పెద్దలను గౌరవించాలని సూచించారు. ముఖ్యంగా వరంగల్ నగరంలోని స్లమ్ ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లల తల్లిదండ్రులు రోజూ కూలీ పనులు చేస్తూ తమ పిల్లల భవిష్యత్తుపై గొప్ప ఆశలు పెట్టుకుంటున్నారని తెలిపారు. పిల్లలు తమ తల్లిదండ్రుల కష్టాన్ని గమనించి చదువుపై మరింత దృష్టి పెట్టాలని అన్నారు.
ఈ లైఫ్ స్కిల్స్ శిక్షణ ద్వారా పిల్లలలో స్వీయ అవగాహన, భావోద్వేగాల నియంత్రణ, లక్ష్య నిర్దేశం మరియు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు మరియు సామాజిక బాధ్యత, ఒత్తిడి నిర్వహణ మరియు మానసిక ఆరోగ్యం, మాదక ద్రవ్యాల దుర్వినియోగం నివారణ మరియు సోషల్ మీడియా వినియోగంపై అవగాహన పెంపొందుతుందని చెప్పారు. ఈ నైపుణ్యాలు వారి జీవితాంతం ఉపయోగపడతాయని, ప్రతి పిల్లవాడు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకొని సమయపాలనతో పాల్గొనాలని కోరారు.
ఈ కార్యక్రమంలో చిల్డ్రన్ ఐకాన్స్ కీర్తన, వర్ధన్, విష్ణు, శిరీష, అనూష పాల్గొన్నారు. ఉపాధ్యాయులు శారద, రాజు, అవినాష్, వెన్నెల తదితరులు మరియు మొత్తం 110 మంది విద్యార్థులు హాజరయ్యారు.