logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఆధ్యాత్మిక శోభతో పులకించిన పసురపాడు

ఆధ్యాత్మిక శోభతో పులకించిన పసురపాడు: ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి.
* పసులపాడులో ఘనంగా హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన.. వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి.

* గోస్పాడు మండలం పసులపాడులో భక్తి ప్రపత్తుల నడుమ విగ్రహ ప్రతిష్ట: భారీగా తరలివచ్చిన భక్తులు

నంద్యాల జిల్లా గోస్పాడు మండలంలోని పసులపాడు గ్రామం ఆధ్యాత్మిక చైతన్యంతో విరాజిల్లింది. గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం భక్తిశ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నంద్యాల మాజీ శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.


పసులపాడు గ్రామానికి చేరుకున్న శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డికి వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. గ్రామ ప్రజలు, వైఎస్ఆర్సిపి నాయకులు పెద్ద ఎత్తున ఆహ్వానం పలికారు. అనంతరం స్వామి వారి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, లోక కల్యాణం కోసం నిర్వహించిన ప్రత్యేక పూజలు మరియు హోమాల్లో పాలుపంచుకున్నారు. వేద పండితులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు పలికారు.

ఈ కార్యక్రమంలో శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి తో పాటు వైఎస్ఆర్సిపి శ్రీశైల నియోజకవర్గ పరిశీలకుడు పి.పి. మధుసూదన్ రెడ్డి, నంద్యాల జిల్లా వైసిపి ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బొబ్బేటి దామోదర్ రెడ్డి, ప్రసాద్ యాదవ్, భక్తవత్సల రెడ్డి, పుల్లయ్య యాదవ్, శేషి రెడ్డి, చిన్న వెంకటసుబ్బారెడ్డిలతో పాటు గ్రామ పెద్దలు, మహిళలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. హనుమ నామస్మరణతో పసులపాడు పురవీధులు మారుమోగాయి.

3
89 views

Comment