కొత్తూరు సుబ్బరాయునికి వెండి నాగభరణం విరాళం.
పాణ్యం (AIMA MEDIA ): ప్రముఖ శైవక్షేత్రం పాణ్యం మండలం ఎస్.కొత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి వెండి నాగభరణం విరాళంగా ఆదివారం భక్తులు సమర్పించాలని ఆలయ ఈవో యం.రామక్రిష్ణ తెలిపారు. ఆళ్ళగడ్డ పట్టణమునకు చెందిన విజయ మోహన్ రావు కుమారుడు వెంకట నాగరాజు అనే భక్తుడు, వారికి స్వామివారు ఇంటి ఇలవేల్పు కావడంతో మొక్కుబడిగా 395 గ్రాముల వెండి నాగభరణము వితరణ చేశారని, వారికి ఆలయ మర్యాదలతో స్వామివారికి అభిషేకం, అర్చనలు, విశేష పూజలు నిర్వహించి, శేష వస్త్రములతో ఘనంగా సన్మానించి ప్రసాదము వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది సుబ్బారెడ్డి మరియు దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.