logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు..వడ్లపూడి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కారుమూరి మహేష్

గాజువాక (వడ్లపూడి )

శ్రీ శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినం సందర్భంగా కుంకుమ పూజలు నిర్వహించడం జరిగింది.

వడ్లపూడి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కారుమూరి మహేష్,ప్రధాన కార్యదర్శి ములుకూరి వెంకటరమణ (కోశాధికారి),కర్నాటి మధుసూదన్ శెట్టి ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఐవిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కోన శ్రీనివాసరావు ఆర్థిక సహాయంతో ఒక లాప్టాప్,రెండు స్టిచ్చింగ్ మిషన్లు,నాలుగు వెట్ గ్రైండర్లు పేద ఆర్యవైశ్యులకు ఇవ్వడం జరిగింది.

ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కారుమూరి మహేష్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఐవిఎఫ్ విద్యా కమిటీ చైర్మన్ బొగ్గవరపు వెంకటేశ్వర్ల తాతాజీ కి వడ్లపూడి ఆర్యవైశ్య సంఘం కమిటీ సభ్యులు ఘనంగా శాలువా కప్పి సన్మానించడం అలాగే మెమొంటోనీ ఇవ్వడం జరిగింది.ముఖ్య అతిథులు చేతి మీద పదవ తరగతి 492 మార్కులతో పాసై నా పేద విద్యార్థినికి ఉచిత ల్యాప్టాప్ ఇవ్వడం జరిగినది.ఆర్యవైశ్య మహిళా లకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న సమయంలో ఆర్థిక సాయం తోడ్పాటుకు వడ్లపూడి ఆర్యవైశ్య సంఘం కుట్టు మిషన్లు అలాగా వెట్ గ్రైండర్లు పంపిణీ చేయడం జరిగింది. బొక్క వరపు వెంకటేశ్వర్ల తాతాజీ విద్యార్థులకు విద్యాసంస్థలు మొదలుకొని అనగా జూన్ నెల నుంచి పేద విద్యార్థులకు చదువు నిమిత్తం తన సొంత స్కాలర్షిప్ ఏర్పాటు చేసి ఆర్యవైశ్య బిడ్డలు చదువుకునే విధంగా చర్యలు చేపడతారని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఐ వి ఎఫ్ విద్యా కమిటీ చైర్మన్ బొగ్గవరపు వెంకటేశ్వర్ల తాతాజీ ఏ ఐ ఎమ్ ఏ మీడియా తో మాట్లాడుతూ వడ్లపూడి ఆర్యవైశ్య సంఘం అతి తక్కువ సమయంలో కమిటీగా ఏర్పడి ఆర్యవైశ్య సంఘం బలోపేతానికి అందర్నీ కలుపుకుంటూ కారుమూరి మహేష్ సంఘాన్ని నిలబెడితే పేద విద్యార్థులకు బడుగు బలహీన వర్గాలకు ఆశగా నిలబడి పలు సేవా కార్యక్రమాలు చేస్తూ వడ్లపూడి ఆర్యవైశ్య సంఘం ఆంధ్రప్రదేశ్లో నిలిచే విధంగా కృషి చేస్తున్న వడ్లపూడి ఆర్యవైశ్య సంఘానికి ధన్యవాదాలు తెలిపారు.


వడ్లపూడి ఆర్యవైశ్య అధ్యక్షులు కారుమూరి మహేష్ ఏ ఐ ఎమ్ ఏ మీడియాతో మాట్లాడుతూ వడ్లపూడి ఆర్యవైశ్య సంఘం ఏర్పాటుకు నాకు సహకరించిన మిత్రులు,ఆర్యవైశ్య సంఘ పెద్దలు సహకారంతో వడ్లపూడి వడ్లపూడిలో ఆర్యవైశ్య సంఘం సహకారంతో 600 గజాలలో మూడు ఫ్లోర్లతో అత్యంత ఆధునీకరణతో కళ్యాణ మండపం, విడిదిల్లు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ యొక్క కళ్యాణ మండపానికి దాతల సహకారంతోపాటు ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఎంతగానో శ్రమించి ఈ యొక్క కళ్యాణమండపాన్ని ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత ఆధునీకరణతో కూడిన కళ్యాణ మండపముగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్యవైశ్య పేద కుటుంబాలకు కళ్యాణం నిమిత్తం కళ్యాణ మండపాన్ని ఉచితంగా అందించడం జరుగుతాదని తెలిపారు.సకల శుభకార్యాలకు కూడా ఆర్యవైశ్యులందరూ కూడా ఈ కళ్యాణ మండపాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నారు.ఈ యొక్క కార్యక్రమానికి నాకు సహకరించిన కమిటీ సభ్యులందరికీ కూడా పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.


ములుకూరి వెంకటరమణ (కోశాధికారి) ఏ ఐ ఎమ్ ఏ మీడియాతో మాట్లాడుతూ ఈరోజు అమ్మవారి జన్మదిన వేడుకలో భాగంగా అత్యంత ఆధునీకరణతో రూపుదిద్దుకున్న కళ్యాణ మండపంలో శ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిలో భాగంగా 102 మంది కుంకుమార్చన లో పాల్గొని అమ్మవారి సేవకు తరించిన మహిళలకు అమ్మ వాసవి మాత కరుణాకటాక్షాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు.



కర్నాటి మధుసూదన్ శెట్టి (ట్రెజరర్) ఏ ఐ ఎమ్ ఏ మీడియాతో మాట్లాడుతూ అత్యంత భక్తిశ్రద్ధలతో కుటుంబ సమేతంగా కలిసి శ్రీ వాసవి మాత పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అమ్మవారి కరుణాకటాక్షాలు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు. తదనంతరం భక్తులందరికీ కూడా అల్పాహార ఏర్పాట్లు కమిటీ వారు చేయడం జరిగిందని సెవెన్యంగా తెలపడం జరిగింది.



ఈ కార్యక్రమంలో వడ్లపూడి ఆర్యవైశ్య సంఘం సభ్యులు,ఆర్యవైశ్య మహిళలు,పెద్దలు పూజా కార్యక్రమం లో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

1
202 views

Comment