logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

వేసవి సెలవుల్లో దొంగతనాల నివారణకు ప్రత్యేక నిఘా – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS



వేసవి సెలవుల సమయంలో అనేక కుటుంబాలు పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు ప్రయాణాలు చేసే నేపథ్యంలో, ఖాళీగా ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయని చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారు ఒక ప్రకటనలో తెలిపారు.

ఇటీవల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నమోదైన దొంగతన ఘటనలను దృష్టిలో ఉంచుకుని, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక నిఘా చర్యలను చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా ఇలాంటి నేరాలను సమర్థవంతంగా నిరోధించవచ్చని ఆయన సూచించారు.

*ప్రజలు తప్పనిసరిగా పాటించాల్సిన భద్రతా సూచనలు:*

• ఇళ్లలో నగదు, బంగారం వంటి విలువైన వస్తువులను నిల్వ ఉంచకుండా, బ్యాంక్ లాకర్లలో భద్రపరచాలి.

• ప్రయాణానికి ముందు సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలి. తద్వారా LHMS (Locked House Monitoring System) ద్వారా మీ ఇంటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయబడటంతో పాటు, ఆ ప్రాంతంలో బీట్ పెట్రోలింగ్‌ను కూడా పెంచబడుతుంది.

• ఇంటి వద్ద CCTV కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలి.

• ఇంటి పైభాగంలో (మిద్దెపై) నిద్రించే వారు, ఇంటికి తాళాలు వేసి వాటిని తమ వద్ద ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలి.

• మీ ప్రయాణ వివరాలను నమ్మకమైన పొరుగువారికి లేదా బంధువులకు తెలియజేయడం మంచిది.

• ఇంటి తలుపులు, కిటికీలు పూర్తిగా సురక్షితంగా లాక్ చేసినట్లు నిర్ధారించుకోవాలి.

• అవసరమైతే ఆటోమేటిక్ లాకింగ్ సిస్టమ్‌లు లేదా అలారం వ్యవస్థలను వినియోగించాలి.

• బ్యాంకులు, ఏటీఎంలు, బంగారు దుకాణాలు హై-క్వాలిటీ CCTV కెమెరాలను ఏర్పాటు చేసి, అవి నిరంతరం పనిచేస్తున్నాయో లేదో పర్యవేక్షించాలి.

• ఏటీఎం కేంద్రాలలో రాత్రి సమయాల్లో సెక్యూరిటీ గార్డులను తప్పనిసరిగా నియమించాలి.

• అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.

• బస్సులు, రైళ్లు వంటి ప్రజా రవాణాలో ప్రయాణించే సమయంలో వ్యక్తిగత సామాన్లు, నగలు జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. అపరిచితులు ఇచ్చే ఆహార పదార్థాలు స్వీకరించకూడదు.

• ఇంటి బయట నిద్రించే వారు ఆభరణాలు ధరించకుండా ఉండటం మంచిది.

ఏదైనా అనుమానాస్పద పరిస్థితి గానీ, అత్యవసర పరిస్థితి గానీ ఎదురైన వెంటనే *Dial 112* కు లేదా చిత్తూరు పోలీస్ whatsapp నెంబర్ కు కాల్ చేసి పోలీసుల సహాయం పొందవచ్చు.

“ప్రజల సహకారం లేకుండా నేర నియంత్రణ సాధ్యం కాదు. ప్రజల అప్రమత్తతే వారి ఆస్తి రక్షణకు ప్రధాన ఆధారం.” అని జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారు పేర్కొన్నారు.

68
5112 views

Comment