జనగణన - మన బాధ్యత హిందూపురంలో 5K రన్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్*
హిందూపురం, ఏప్రిల్ 26, 2026:
సెన్సస్-2027లో భాగంగా నిర్వహిస్తున్న సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఆదివారం హిందూపురం పట్టణంలో భారీ *5K రన్* నిర్వహించబడింది. జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ వారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలు, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు మరియు రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.హిందూపూర్ పట్టణంలోని గాంధీ సర్కిల్ వద్ద జిల్లా కలెక్టర్ గారు జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. సభలో సెన్సస్ యొక్క ప్రాముఖ్యతను ఆయన వివరించారు.ఈ 5K రన్ గాంధీ సర్కిల్ నుండి ప్రారంభమై, పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగి తెలుగు తల్లి విగ్రహం వద్ద ముగిసింది.ప్రజలందరూ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా తమ వివరాలను స్వచ్ఛందంగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ కోరారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించే భవిష్యత్తు ప్రణాళికలు మరియు ప్రాజెక్టులకు ఈ గణాంకాలే మూలాధారమని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న తొలి దశలో ప్రతి ఇల్లు, వీధి మరియు గ్రామ పరిధిలోని గృహాల వివరాలను నమోదు చేస్తున్నారు.2027 ఫిబ్రవరిలో జరిగే పాపులేషన్ సెన్సస్ ద్వారా కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు మరియు కుల గణన చేపట్టడం జరుగుతుంది.ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సెన్సస్ ప్రక్రియలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.రాబోయే 'జనాభా గణన 2027' అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు వకృత్వ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని జనాభా గణన ప్రాముఖ్యతను వివరించారు.జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు జనాభా గణనపై వకృత్వ పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ విజేతలుగా ఎంపిక చేయడం జరిగింది.విజేతలకు ఈ కార్యక్రమంలో భాగంగా జ్ఞాపికలు (మెమెంటోలు) అందజేశారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థి దశ నుంచే సామాజిక అంశాలపై అవగాహన పెంచడం విశేషం అని కలెక్టర్ పెర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శులు వీరయ్య, p.శ్రీనివాస్ రావు ,మున్సిపాల కమిషనర్భా మాలి్మార్జున్ర్గ nbk team భార్గవ్ , చింటూ,అమీన్ నాగేంద్ర,అశోక్, ఖలీం, ఆమెన్, రెహన్ ,ఆర్డీఓ ఆనంద్ కుమార్, డిఎస్పి మహేష్,తహశీల్దార్ వెంకటేశు,మడకశిర తహసీల్దార్ మైనుద్దీన్, మరియు ప్రజా ప్రతినిధులు సిబ్బంది పాల్గొన్నారు.