logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

క్రైమ్ ఎగైనెస్ట్ ఉమెన్ మరియు చిల్డ్రన్ సేఫ్టీ గురించి అవగాహన సదస్సు ఏర్పాటు. టూ టౌన్ సిఐ

సుండి పెంట గ్రామంలో "క్రైమ్ ఎగైనెస్ట్ ఉమెన్ మరియు చిల్డ్రన్ సేఫ్టీ గురించి అవగాహన ఏర్పాటు...

నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS గారి ఆదేశాలమేరకు ఆత్మకూరు డిఎస్పీ గారి సూచనలతో సుండిపెంట రింగు పార్కు దగ్గర మహిళలతో "క్రైమ్ ఎగైనెస్ట్ ఉమెన్ మరియు చిల్డ్రన్ సేఫ్టీ గురించి అవేర్నెస్ కల్పించడం జరిగింది.మహిళలకు సంబంధించిన చట్టాల గురించి మరియు ప్రతి మహిళ తమ సెల్ ఫోన్లలో శక్తి యాప్ నిక్షిప్తం చేసుకోవాలని తెలియజేస్తూ శక్తి ప్రయోజనాల గురించి వివరించడం జరిగింది.మహిళలు ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు శక్తి యాప్ నెంబర్ 7993485111కు కాల్ చేసి సహాయం
పొందవచ్చునని వివరించడం జరిగింది.మాదకద్రవ్యాలైన గాంజా, హెరాయిన్ ఇతర మత్తు పదార్థాలు గురించి ఏదైనా తెలిసిన "ఈగల్" అని ఒక వింగ్ ఉన్నదని దానికి 1972 కాల్ చేయవచ్చునని తెలపటమైనది.
సైబర్ నేరాలు జరిగినచో టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి ఫోన్ చేయాలని అలాగే బాల్యవివాహాలు, చిన్న పిల్లలపై నేరాలు జరిగినచో 1098 కు ఫిర్యాదు చేయవచ్చు అని తెలపటమైనది.అత్యవసర పరిస్థితులలో టోల్ ఫ్రీ నెంబర్స్ 100 మరియు112 కు ఫోన్ చేసి పోలీసువారి తక్షణ సహాయం పొందవచ్చునని తెలపటమైనది.

37
5755 views

Comment