logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ప్రచురణార్థం *స్వీయ గణన సదుపాయం వినియోగించాలి.....జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి*

ప్రచురణార్థం

*స్వీయ గణన సదుపాయం వినియోగించాలి.....జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి*

*2027 జన గణనలో భాగంగా ఇండ్ల జాబితా తయారీకి పకడ్బందీ చర్యలు*

*ఆన్‌లైన్ స్వీయ గణనకు ప్రత్యేక వెబ్‌సైట్ వినియోగించాలని సూచన*
--------------------------
ఖమ్మం, ఏప్రిల్-25:
--------------------------
జనగణన–2027లో భాగంగా స్వీయ గణన సదుపాయం వినియోగించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

జన గణన 2027 మొదటి దశ ప్రక్రియ అయిన ఇండ్ల జాబితా తయారీ కార్యక్రమం 2026 మే 11 నుండి జూన్ 9 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ గణనలో భాగంగా మొట్టమొదటిసారిగా స్వీయ గణన (Self-Enumeration) సదుపాయాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వచ్చిందని, ఈ సదుపాయం 2026 ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు 15 రోజుల పాటు https://se.census.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని తెలిపారు.

జిల్లా ప్రజలు తమ మొబైల్ నెంబర్‌తో పోర్టల్‌లో లాగిన్ అయి, తమ గృహాన్ని జియో-ట్యాగ్ చేసి అవసరమైన వివరాలను నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత “H” అక్షరంతో ప్రారంభమయ్యే 11 అంకెల Self-Enumeration ID (SE ID) జనరేట్ అవుతుందని తెలిపారు.

ఈ SE IDను ఫీల్డ్ వెరిఫికేషన్ కోసం ఇంటికి వచ్చే ఎన్యుమరేటర్‌కు అందజేస్తే గణన ప్రక్రియ వేగవంతంగా పూర్తవుతుందని పేర్కొన్నారు. జిల్లా ప్రజలు అందరూ ఈ స్వీయ గణన సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆ ప్రకటనలో కోరారు.
------------------------------
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మంచే జారీ చేయనైనది.

0
0 views

Comment