ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇన్ఫోసిస్ సంస్థ ఆధ్వర్యంలో కంప్యూటర్స్ వితరణ
పత్రికా ప్రకటన
*ఐనవోలు* మండలంలోని 15 ప్రభుత్వ పాఠశాలలకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా కంప్యూటర్ల వితరణ
ఐనవోలు (హన్మకొండ జిల్లా): ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐనవోలు మండలంలోని 15 వివిధ పాఠశాలలకు కంప్యూటర్లను వితరణగా అందజేశారు.
ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి (MEO) పులి ఆనందం గారు, ఐనవోలు సర్పంచ్ వంశీ గారు మరియు కొండపర్తి సర్పంచ్ అశోక్ రావు గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి కంప్యూటర్లను పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రాథమిక స్థాయి నుంచే అందించాలనే ఈ చొరవను వారు అభినందించారు.
ఈ వితరణకు ప్రత్యేక కృషి చేసిన *ఇన్ఫోసిస్ ప్రాజెక్ట్ మేనేజర్ రాపాక స్వాతి, CSR కోఆర్డినేటర్ రాపాక నాగరాజు* గార్లకు, మరియు ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించిన గందె ప్రభాకర్, కరిమిళ్ల వెంకటేశ్వర్లు, ఐనవోలు ఉప సర్పంచ్ భాస్కర్ గార్లకు మండల విద్యాశాఖ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కొండపర్తి స్కూల్ HM కవిత గారు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు. విద్యాభివృద్ధికి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అందిస్తున్న ఈ సహకారం ఎంతో ఆదర్శనీయమని వక్తలు కొనియాడారు.