logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో కీర్తిశేషులు మండలి వెంకటకృష్ణారావు శతజయంతి ఉత్సవాల లో భాగంగా జాతీయ సాహితీ సదస్సు

*కన్నతల్లిలాంటి తెలుగు భాషను కాపాడుకుందాం*

*భాషా పరిరక్షణకు మనందరి బాధ్యత*

*కవి సమ్మేళనంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి*

కన్నతల్లిలాంటి తెలుగు భాషను కాపాడుకుందామని పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి పిలుపునిచ్చారు. పలమనేరు నియోజకవర్గంలోని గంగవరం మండలం సాయి గార్డెన్ సిటీలో తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో కీ. శే. మండలి వెంకట కృష్ణారావు శత జయంతి ఉత్సవాలలో భాగంగా జరిగిన జాతీయ సాహితీ సదస్సు మరియు కవి సమ్మేళనం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా శాసన సభ మాజీ ఉప సభాపతి అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తో కలసి శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....మాతృ భాష పరిరక్షణ మనందరి బాధ్యత అన్నారు. భాష అనేది కేవలం భావ వ్యక్తీకరణకు సాధనం మాత్రమే కాదని , అది మన తరతరాల చరిత్రకు వారధిగా ఆయన పేర్కొన్నారు. మన పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి మన మాతృభాష కావాలని అన్నారు. అనంతరం తెలుగు భాషా పరిరక్షణకు కృషి చేస్తున్న రచయితలు, కవులను ఆయన కొనియాడారు. ఈ సందర్బంగా కార్యక్రమ నిర్వహకులు ఆయన్ను ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమాల్లో తెలుగు భాషభిమానులు, స్థానికులు పాల్గొన్నారు.

54
2122 views

Comment