logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అరకు: ఘనంగా జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం

అరకులోయ మండల పరిషత్ సమావేశ మందిరంలో జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఎంపీడీఓ వీసం ప్రసాద్ మాట్లాడుతూ..1992లో చేసిన 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయితీలకు రాజ్యాంగ హోదా వచ్చిందని అన్నారు. 1993 ఏప్రిల్ 24న అమలులోకి రావడంతో గ్రామస్థాయిలో ప్రజాస్వామ్యం మరింత బలపడిందని అన్నారు. పంచాయితీల ముఖ్య బాధ్యతలలో శుచిత్వం, తాగునీరు, రహదారులు, విద్య, ఆరోగ్య సేవలు ఉన్నాయన్నారు.

0
0 views

Comment