logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మర్రి నరేష్ ప్రధాన వార్త : సహకార ఎన్నికలు నిర్వహించాల్సిందే.. నామినేటెడ్ పద్ధతిపై 'జగిత్యాల' గర్జన...!

జగిత్యాల, ఏప్రిల్ 24: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) పీఠాలపై నామినేటెడ్ పద్ధతిలో నియమించాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనపై జగిత్యాల జిల్లా సహకార సంఘాల చైర్మన్లు సమరశంఖం పూరించారు. "సహకార వ్యవస్థకు రైతులే వెన్నుముక - అడ్డదారిలో ప్రభుత్వ పెత్తనం తగదు" అంటూ జగిత్యాల ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు ధ్వజమెత్తారు.
​సహకార సంఘాలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ద్వారా కాకుండా, నామినేటెడ్ పద్ధతిలో నియమించాలని చూడటం అత్యంత దుర్మార్గమని జిల్లా సహకార సంఘాల ఫోరం నాయకులు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేకనే ఇలాంటి "ప్రజాస్వామ్య వ్యతిరేక" నిర్ణయాలు తీసుకుంటోందని వారు ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో సహకార వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిందని, రాజకీయ జోక్యంతో రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే నామినేటెడ్ విధానంపై తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో కోర్టు మెట్లు ఎక్కి న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా గ్రామస్థాయిలో రైతులను, ప్రజాక్షేత్రాన్ని సమీకరించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
​సహకార సంఘాలపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని డిమాండ్ చేసిన వారిలో జిల్లా పీఏసీఎస్ చైర్మన్లు రాజ్ సుమన్ రావు, సాగర్ రావు, మహిపాల్ రెడ్డి, మధుసూదన్ రావు, మాధవరావు ఇతర ఫోరం నాయకులు ఉన్నారు.

52
2790 views

Comment