శనగలు, జొన్నలు తక్షణమే కొనుగోలు చేయాలి*
*వ్యవసాయ మంత్రికి పాయల్ శంకర్*
అదిలాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా, ప్రత్యేకించి
ప్రెస్ నోట్
తేది: 24-04-2026
*అదిలాబాద్ జిల్లా రైతులు కష్టపడి పండించిన శనగలు మరియు జొన్నలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని బీజేఎల్పీ ఉపనేత, అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి *తుమ్మల నాగేశ్వరరావు గారికి లేఖ రాసి విజ్ఞప్తి చేశారు*
రైతులు పంటలు పండించినా కనీస మద్దతు ధర అందక తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా వెంటనే సేకరణ జరగకపోతే అన్నదాతలు మరింత ఆర్థిక కష్టాల పాలవుతారని హెచ్చరించారు.
మార్కెట్లో శనగలు, జొన్నలకు తగిన ధర రాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, ప్రభుత్వం స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని పాయల్ శంకర్ మంత్రికి చేసిన లేఖలో స్పష్టంగా కోరారు.
రైతు సంక్షేమం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బీజేఎల్పీ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ హెచ్చరించారు.