logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో ఆత్మబలిదానం చేసుకున్న ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించిన కేటీఆర్, హరీష్ రావు

శంకర్ గౌడ్ ది ఆత్మహత్య కాదు. ఇది రేవంత్ ప్రభుత్వం చేసిన హత్యే

రెండున్నరేళ్లుగా సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసి కార్మికులకు చేస్తున్న తీరని ద్రోహాన్ని తట్టుకోలేకే శంకర్ గౌడ్ బలవన్మరణానికి పాల్పడ్డారు

శంకర్ గౌడ్ గారి పార్థివదేహాన్ని నర్సంపేట డిపో వద్దకు తీసుకెళ్లి నివాళులు అర్పించేందుకు కూడా అనుమతించకపోవడం అత్యంత దుర్మార్గమైన చర్య

కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలన వల్ల కుటుంబ పెద్దను కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న శంకర్ గౌడ్ గారి కుటుంబానికి రూ.1 కోటి పరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి అన్నివిధాలా ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం - కేటీఆర్

శంకర్‌కు గౌడ్ మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే బాధ్యత. ఈ ప్రభుత్వ అలసత్వం, నిర్లక్ష్యం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది

అధికారంలోకి రాగానే ఆర్టీసీ విలీన ప్రక్రియను పూర్తి చేసి, వారి అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి మాట తప్పడం వల్లనే ఈ దుస్థితి వచ్చింది

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలి

శంకర్ గౌడ్ అమరుడైన రోజును “అప్పాయింటెడ్ డే”గా ప్రకటించి, ఆయన త్యాగానికి తగిన గౌరవం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం - హరీష్ రావు

21
130 views

Comment