logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఉప రాష్ట్రపతికి కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు ఆహ్వానం ..

శ్రీకాకుళం: ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ను శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను సందర్శించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు కోరారు. ఈ మేరకు గురువారం న్యూఢిల్లీలో ఉప రాష్ట్రపతితో ఆయన మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈనెల 27న విశాఖపట్నంలో జరగనున్న ఆంరఽధాయూనివర్సిటీ (ఏయూ) శతాబ్ది ఉత్సవాలకు ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ ముఖ్య అతిథిగా హాజ రుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ముందస్తు స్వాగతం పలికిన కేంద్రమంత్రి..

ఈ పర్యటనలో భాగంగా జిల్లాకు విచ్చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా లోని చారిత్రక, సుప్రసిద్ధ క్షేత్రాలైన అరసవల్లి సూర్య నారాయణ స్వామి, శ్రీకూర్మనాథ స్వామిని దర్శించుకో వాలని కోరారు. ఆయా దేవాలయాల విశి ష్టతను ఉప రాష్ట్రపతికి వివరించారు. కాగా కేంద్రమంత్రి రామ్మో హన్‌నాయుడు చేసిన ఈ ఆహ్వా నంపై ఉప రాష్ట్రపతి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఉప రాష్ట్రపతి పర్యటన ఖరారైతే, అందుకు తగ్గ స్వాగత ఏర్పాట్లు చేసేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధం కానుంది.

3
212 views

Comment