logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఆర్‌జీఎం కాలేజీలో కమ్యూనిటీ రేడియో స్టేషన్ ఘనంగా ప్రారంభం.

పాణ్యం (AIMA MEDIA): ఆర్‌జీఎం ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం కమ్యూనిటీ రేడియో స్టేషన్ (ఆర్ జి యం ఎఫ్ఎం) ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఎన్‌టీయూ కాకినాడ మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి. తులసి రామ్ దాస్ రేడియో స్టేషన్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ అభివృద్ధిలో ఆర్జీఎం రేడియో స్టేషన్ భాగస్వామ్యం కావాలని కోరారు. విద్యా వైద్య ఆరోగ్య గ్రామీణ అభివృద్ధి గ్రామీణ వ్యవసాయ అభివృద్ధిలో స్టేషన్ తన వంతు సహకారం అందిస్తుందన్నారు.ఆర్‌జీఎం సంస్థల చైర్మన్ డాక్టర్ ఎం. శాంతి రాముడు మాట్లాడుతూ ఈ స్టేషన్ మా ఎండీ ఎం. శివరామ్ కలతో ప్రారంభించబడిందని, ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అని తెలిపారు. సమాజ అభివృద్ధి కోసం శివరామ్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి, విద్యా, ఆరోగ్య, గ్రామీణాభివృద్ధి రంగాల్లో విశేష కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు. ఈ రేడియో స్టేషన్ కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా రూపుదిద్దుకున్నదని పేర్కొన్నారు.అదేవిధంగా డైరెక్టర్ డా. డి.వి. అశోక్ కుమార్, ప్రిన్సిపల్ డా. టి. జయ చంద్ర ప్రసాద్ , ఈసీఈ విభాగాధిపతి డా. జె. సోఫియా ప్రియా దర్శిని ఈ FM స్టేషన్ పర్యవేక్షణలో భాగమై, దాని అవసరం మరియు ప్రయోజనాలను వివరించారు.ఇది సంస్థ ప్రతిష్టను మరింత పెంచే అంశంగా భావిస్తున్నారు.ఈ RGM FM కమ్యూనిటీ రేడియో స్టేషన్ ప్రధానంగా గ్రామీణ ప్రజల అభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడింది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో తాజా సమాచారం, ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు, విద్యా రంగంలో ఉపయోగకరమైన పాఠ్యాంశాలు ప్రజలకు అందించబడతాయి.

0
132 views

Comment