logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

*ఆర్టీసీ సమ్మెపై కీలక పరిణామం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు* ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంద

*ఆర్టీసీ సమ్మెపై కీలక పరిణామం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు*

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వాళ కేబినెట్ భేటీలో ఆర్టీసీ సమ్మెపై చర్చ జరిగింది. ఆర్టీసీ కార్మికులు ఎలాంటి తొందర పాటు నిర్ణయాలు తీసుకోవద్దని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రాణాలు తీసుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదని. .కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో దృష్టి పెట్టిందని సీఎం ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల బృందం రేపు ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులను చర్చలకు ఆహ్వానించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని సీఎం స్పష్టం చేశారు..

0
167 views

Comment