logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

లిఫ్ట్ ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడి అరెస్ట్

జర్నలిస్ట్: ఆకుల గణేష్
భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం రాఘవరెడ్డిపేట సెంటర్ వద్ద లిఫ్ట్ అడిగిన మహిళపై ఒక వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడు. ఆరేపల్లి సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో బైక్ ఆపి, ఆమెను పొదల్లోకి ఈడ్చుకెళ్లి గాయపరిచి, లైంగిక దాడికి ప్రయత్నించాడు. బాధితురాలు ప్రతిఘటించడంతో ఆమె బ్యాగ్ను లాక్కుని పరారయ్యాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, దొంగిలించిన మోటార్ సైకిల్, బాధితురాలి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన వివరాలను చిట్యాల సీఐ మల్లేష్ తెలిపారు.

8
884 views

Comment