logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పంచాయతీ రాజ్ దినోత్సవం సంధర్భంగా ప్రత్యేక గ్రామసభలు

జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవాన్ని ఈ నెల 24 శుక్రవారం అరకులోయ ఎంపీడీఓ ఆఫీసులో ఘనంగా జరపనున్నట్లు ఎంపీడీఓ వీసం ప్రసాద్ తెలిపారు. మండలంలోని అన్ని పంచాయితీలలో నోడల్ అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారన్నారు. ఈ గ్రామసభలో ఆత్మనిర్భర్ పంచాయితీ లక్ష్యాన్ని సాధించేందుకు చర్చలు, ప్రణాళిక తయారు చేస్తారని ఎంపీడీఓ పేర్కొన్నారు. ఈ గ్రామసభలలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారన్నారు.

3
244 views

Comment