logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రోలుగుంట పాఠశాలలో జనగణనపై వ్యాసరచన పోటీలు

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రోలుగుంటలో విద్యార్థులలో సామాజిక అవగాహన పెంపొందించేందుకు "జనగణన" అనేఅంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. జూనియర్, సబ్ జూనియర్ మరియు సీనియర్ విభాగాలలో జరిగిన ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.
పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రతిభను ప్రశంసిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు వారి అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు టీవీ శేషగిరిరావు గారు, ఆంగ్ల ఉపాధ్యాయిని పి.వి.ఎం నాగజ్యోతి , బయాలజీ ఉపాధ్యాయులు విజయరాణి, నాని, హిందీ ఉపాధ్యాయిని రెహానా బేగం గారు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

2
202 views

Comment