పీసీ గోష్ కాదు - పనికి రాని గోష్*
*కేసీఆర్ ను బద్నాం చేయడానికే కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాలు*
*
*మీడియా సమావేశంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్*
కాళేశ్వరం పై కోర్టు ఇచ్చిన తీర్పుపై గురువారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు జోగు రామన్నతో కలిసి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... కేసీఆర్ ను బద్నాం చేయడానికే రేవంత్ రెడ్డి కాళేశ్వరం పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, కేసీఆర్ జగిత్యాలలో సభ పెడితే రేవంత్ రెడ్డి కాళేశ్వరంలో పెట్టడం సిగ్గు చేటని అన్నారు. పిసి గోష్ కమిషన్ నివేదికలో నిజాయితి లేదని ఈ నివేదికతో ఎలాంటి శిక్షలు వేయరాదని కోర్టు అద్భుతమైన తీర్పు ఇవ్వడం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంప చెల్లు సమాదానమని అన్నారు.