పాతపట్నం నియోజకవర్గం లో అక్కరాపల్లి బీ టి రోడ్డు.. MGNREGS నిధులతో ప్రారంభించిన ఎమ్మెల్యే ఎంజీఆర్
AIMA news :
పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండల పరిధిలో అక్కరాపల్లి బీటీ రోడ్ నుండి పూనిపేట (వయా కిట్టాలపాడు) గ్రామం వరకు MGNREGS నిధులతో రూ.200 లక్షల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించాను. ఈ రహదారి ద్వారా అక్కరాపల్లి, కిట్టాలపాడు, పూనిపేట గ్రామాల ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం అవడంతో పాటు రైతులకు తమ పంటలను మార్కెట్‌కు తరలించడం సౌకర్యవంతంగా మారుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని పేర్కొన్నాను.
ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి MGNREGS వంటి పథకాల ద్వారా విస్తృతంగా నిధులు కేటాయిస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తోంది. పాతపట్నం నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను దశలవారీగా అమలు చేస్తామని తెలియజేశాను. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
#RuralDevelopment #MGNREGS #RoadConnectivity
#MamidiGovindaRao #Pathapatnam