logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఎల్ ఎన్ పేట మండలంలో కేజీబీవీ జూనియర్ కాలేజీ లో అదనపు గదులు ప్రారంభించిన ఎమ్మెల్యే ఎంజీఆర్

AIMA న్యూస్ :
పాతపట్నం నియోజకవర్గం ఎల్.ఎన్.పేట మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) జూనియర్ కాలేజీలో సమగ్ర శిక్ష (2024-25) నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులు, కంప్యూటర్ రూమ్, ఆర్ట్ & క్రాఫ్ట్ రూమ్‌లను ప్రారంభించారు . విద్యార్థినుల సౌకర్యార్థం సుమారు రూ. 2.49 కోట్ల వ్యయంతో నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ఆనందంగా ఉంది. ఈ వసతులు విద్యార్థినులకు సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మకత పెంపొందించడంలో దోహదపడతాయి.

గౌరవ ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu గారి నాయకత్వంలో, ఐటి & విద్యాశాఖ మంత్రివర్యులు Nara Lokesh గారి దిశానిర్దేశంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి. సమగ్ర శిక్ష నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్తున్నాము. విద్యార్థినులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ కార్యక్రమంలో నాయకులు, విద్యాశాఖ అధికారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

#EducationDevelopment #KGBV #DigitalLearning
#MamidiGovindaRao #Pathapatnam
@topfans

5
164 views

Comment