ఆర్టీసి రక్షణ కోసం, సమస్యల సాధన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకై సమ్మేను జయప్రదం చేయండి
[ 22 ఏప్రిల్ 2026 మొదటి డ్యూటి నుండి జరుగు
డిమాండ్లు :-
1. ఆర్టీసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి.
2. 2021 వేతన సవరణ 30% ఫిట్మెంట్ తో అమలు చేయాలి. 2025 వేతన సవరణ అమలు చేయాలి.
3. మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ప్రతినెల 400 కోట్లు ఆర్టీసికి ఇవ్వాలి
4. ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి / బెడ్ విన్నర్ పోస్టులను పర్మినెంట్ ఉద్యోగాల కింద భర్తీ చేయాలి.
5. ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి.
6. ఆర్టీసి ఉద్యోగులపై పనిభారాలు తగ్గించాలి / కండక్టర్ డ్రైవర్లలపై KMPL, EPK వేధింపులు మానుకోవాలి.
7. ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వమే కొని ఆర్టీసికి ఇవ్వాలి / ఆర్టీసి స్థలాలను ఈవీ బస్సులకు ఇవ్వరాదు. 8. అద్దె బస్సులను, అద్దె బస్సుల డ్రైవర్లలను ఆర్టీసిలో విలీనం చేసుకోవాలి (గతంలో మాదిరిగా జాతీయం చేసుకోవాలి)
9. గ్రేటర్ హైదరాబాద్ జోన్లో పనిచేస్తున్న సిబ్బందిని కరీంనగర్ జోన్, హైదరాబాద్ జోన్లకు బలవంతగా బదిలి చేసే ఉత్తర్వులను రద్దు చేయాలి /2019 సమ్మే కాలంలో నమోదైన పోలీస్ కేసులను ఎత్తివేయాలి
10. మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి.
11. రద్దీకనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలి / అన్ని కేటగిరీలలోని ఖాళీలను భర్తీ చేయాలి.
12. రిటైరైన ఉద్యోగుల బకాయిలను అన్నిటినీ చెల్లించాలి / చెల్లించటంతో పాటు దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి.
TGSRTC జాయింట్ యాక్షన్ కమిటీ