*ఆర్టీసీ బస్టాండ్ ను సందర్శించిన పోలీస్ కమిషనర్...*
*ఆర్టీసీ బస్టాండ్ ను సందర్శించిన పోలీస్ కమిషనర్...*
టీజీఎస్ఆర్టీసీ జేఏసీ సమ్మె నేపథ్యంలో నగరంలోని బైపాస్ రోడ్డులో గల ఆర్టీసీ నూతన బస్టాండ్ ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సందర్శించారు. స్థానిక పరిస్థితులపై ఆర్టీసీ అధికారులతో మాట్లాడారు. బందోబస్త్ లో వున్న పోలీస్, అధికారులు సిబ్బంది మొత్తం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆర్టీసీ జేఏసీ కార్మికుల సమ్మె సందర్బంగా ప్రైవేట్ డ్రైవర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పూర్తిస్థాయిలో పోలీస్ రక్షణ ఉంటుందని పేర్కొన్నారు. అదేవిదంగా ప్రజా రవాణా వ్యవస్థకు (బస్సులు) ప్రభుత్వ అస్తులకు నష్టం కలిగించడం, ఆటంకాలు సృష్టించడం వంటి చర్యలకు పాల్పడితే వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని టౌన్ ఏసీపీ రమణమూర్తి కి ఆదేశించారు.