logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలి: JAC అధ్యక్షడు అందనం దేవరాజు.

పాణ్యం (AIMA MEDIA):పాణ్యం మండలం ఎంపీడీఓ ఆఫీస్ పరిధిలో దివ్యాంగ JAC ఆధ్వర్యంలో అధ్యక్షడు అందనం దేవరాజు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి వనము రాజు ఆధ్వర్యంలో దివ్యాంగుల సమస్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.దివ్యాంగుల సమస్యలు కోసం,దివ్యాంగుల హక్కుల విషయాల గురించి JAC అధ్యక్షడు అందనం దేవరాజు మాట్లాడుతూ పాణ్యం లో దివ్యాంగుల సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలు గురించి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లు గా పరిష్కారం కాకుండా ఉండే సమస్యల పై దివ్యాంగులు అందరూ కలసి కట్టుగా సాధించుకోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి వనము రాజు మాట్లాడుతూ ముఖ్యంగా 3 సెంట్ల ఇంటి స్థలం ఇచ్చి ప్రభుత్వం ఇల్లు నిర్మించడం,వివాహ ప్రోత్సాహం 5 లక్షలు,35 kg అంత్యోదయ రేషన్ కార్డు ఇవ్వడం మరియు ప్రభుత్వం రేషన్ షాప్ ఇచ్చే క్రమంలో 5% రిజర్వేషన్లు అమలు చేసి దివ్యాంగులకు రేషన్ షాప్ లు కేటాయించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు .పాణ్యం మండలము లో నూతన కమిటీ నీ ఎన్నుకోవడం జరిగింది. మండల దివ్యంగా జేఏసీ అధ్యక్షుడు శివ కుమార్ ప్రధాన కార్యదర్శిగా, శ్రీనివాసులు ఉపాధ్యక్షులు గా,బాలక్రిష్ణని ప్రచార కార్యదర్శిగా, రవి కుమార్ కోశాధికారి గా బలపనుర్ మధు, మహిళ విభాగం లో షేక్ రేష్మా ను ఎన్నుకున్నారు
.

0
988 views

Comment