*ప్రైవేట్ డ్రైవర్ల నిర్లక్ష్యం ___
ప్రమాదానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి: తీన్మార్ మల్లన్న*
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో అనుభవం లేని ప్రైవేట్ డ్రైవర్లకు బస్సులు అప్పగించడం వల్ల కరీంనగర్లో జరిగిన ప్రమాదం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది అని RTC బీసీ ఎంప్లాయిస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, MLC తీన్మార్ మల్లన్న గారు మండిపడ్డారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని తీవ్ర విమర్శలు చేశారు. అనుభవం లేని వ్యక్తులకు బస్సులు ఇవ్వడం ద్వారా ప్రయాణికుల భద్రతను పూర్తిగా పక్కన పెట్టారని ఆరోపించారు. ఈ ప్రమాదానికి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమేనని, ముఖ్యమంత్రి నైతిక బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రజల ప్రాణాలకు విలువ లేకుండా, కార్మికుల కష్టానికి గౌరవం ఇవ్వకుండా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రాధాన్యత ఏంటో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. అనుభవం లేని డ్రైవర్లతో బస్సులు నడపడం ఎంత ప్రమాదకరమో అనుభవం లేని ముఖ్యమంత్రి ఈ రాష్టాన్ని నడపటం అంతే ప్రమాదకరం అని అయన స్పష్టం చేశారు.
కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుండా, తాత్కాలిక చర్యలతో పరిస్థితిని మరింత విషమం చేస్తున్నారని, వెంటనే సరైన నిర్ణయాలు తీసుకుని ప్రజల ప్రాణాలను కాపాడాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ప్రజల భద్రతకు హామీ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం తక్షణమే మార్గదర్శక చర్యలు తీసుకోవాలని తీన్మార్ మల్లన్న గారు కోరారు.