ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారి మృతి పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు గారు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారి మృతి పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు గారు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్‌లోని వారి నివాసానికి వెళ్లి నాదెండ్ల భాస్కరరావు గారి భౌతికకాయానికి పుష్పగుచ్ఛం ఉంచి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాదెండ్ల భాస్కరరావు గారు శాసనసభ్యుడిగా, మంత్రి, ఎంపీగా ప్రజా జీవితంలో అందించిన సేవలు చిరస్మరణీయమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
అనంతరం నాదెండ్ల మనోహర్ గారు, మురళీధర్ గారిని కలిసి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
నాదెండ్ల భాస్కరరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.