logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం...


పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం...

*ప్రజా రవాణా వ్యవస్థకు నష్టం కలిగిస్తే తీవ్రమైన చర్యలు*

*ప్రైవేట్ డ్రైవర్లు ఆందోళన పడాల్సిన అవసరం లేదు పూర్తి రక్షణ కల్పిస్తాం : పోలీస్ కమిషనర్*

టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ, ప్రవేటు ఆస్తులకు, ప్రజా రవాణా వ్యవస్థకు (బస్సులు) నష్టం కలిగించడం తీవ్రమైన నేరంమని, ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రైవేట్ డ్రైవర్లు ఆందోళన, భయపడాల్సిన అవసరం లేదని, పోలీసులు పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తారని పేర్కొన్నారు. అదేవిదంగా బస్సులకు, ప్రభుత్వ అస్తులకు నష్టం కలిగించడం, ఆటంకాలు సృష్టించడం వంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. సమ్మె పేరుతో బస్సులపై రాళ్లు రువ్వడం, వాటిని ధ్వంసం చేయడం వంటి ఘటనలపై పోలీస్ కఠినంగా వ్యవహరిస్తోందన్నారు.

పి ఆర్ వో

0
0 views

Comment