*వరంగల్లో కానిస్టేబుల్ సంగీత ఆత్మహత్య.. వేధింపులే కారణం?*
జర్నలిస్టు: మాకోటి మహేష్
వరంగల్ మట్టెవాడలో కానిస్టేబుల్ సంగీత సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. పోలీసుల ప్రకారం.. BHPLలో CM సభ బందోబస్తుకు వెళ్లి మంగళవారం ఇంటికి వచ్చిన సంగీత.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. కాగా, ఓ సహచర కానిస్టేబుల్ వేధింపుల కారణంగానే ఉరేసుకున్నట్లు సూసైడ్ నోట్లో రాసింది. గణపురం ములుగు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సమయంలోనూ వేధింపులు ఎదుర్కొందని లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.