logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కనకదుర్గమ్మ అమ్మవారికి బంగారు ఆభరణాన్ని కానుకగా సమర్పించారు

తేదీ: 22 ఏప్రిల్, 2026
ఇంద్రకీలాద్రి, విజయవాడ

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలోని కనకదుర్గమ్మ అమ్మవారికి మంగళవారం ఒక భక్తుడు భారీ బంగారు ఆభరణాన్ని కానుకగా సమర్పించారు.
నిజామాబాద్‌లోని ద్వారకా నగర్‌కు చెందిన భక్తుడు తోడుపునూరి శ్రీనివాస్, అమ్మవారిపై ఉన్న భక్తితో 107.500 గ్రాముల బరువున్న బంగారు లక్ష్మీ కాసుల హారాన్ని విరాళంగా అందజేశారు. ఈ హారంలో పచ్చలు మరియు ఎరుపు రాళ్లు (కెంపులు) పొదిగి ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం, ఈ బంగారు ఆభరణం విలువ సుమారు ₹16,30,000 నుండి ₹16,70,000 (పదహారు లక్షల డెబ్బై వేల రూపాయలు) మధ్య ఉంటుందని అంచనా. "దాత తోడుపునూరి శ్రీనివాస్ గారు తన వ్యక్తిగత కారణాల వల్ల తన ఛాయాచిత్రాన్ని (Photo) మీడియాలో ప్రచురించడానికి ఇష్టపడలేదు. కేవలం ఈ సమాచారాన్ని మాత్రమే ప్రచురించాల్సిందిగా కోరుచున్నాము."

దాత వివరాలు:
పేరు: తోడుపునూరి శ్రీనివాస్
నివాసం: ఇంటి నంబర్: 5-6-20, ద్వారకా నగర్, నిజామాబాద్
సమర్పించిన కానుక: పచ్చలు, ఎరుపు రాళ్లు కలిపిన బంగారు లక్ష్మీ కాసుల హారం
మొత్తం బరువు: 107.500 గ్రాములు

0
35 views

Comment