logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

శ్రీసిటీ DSP బీవీ శ్రీనివాసులు* విద్యార్థుల కోసం పలు ముఖ్యమైన సూచనలు

*విద్యార్థులకు వేసవి సెలవుల సందర్భంగా జాగ్రత్తలు పాటించాలని సూచించిన శ్రీసిటీ DSP బీవీ శ్రీనివాసులు*
👉 వేసవి సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు తమ ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని శ్రీసిటీ డీఎస్పీ బి.వి. శ్రీనివాసులు సూచించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే ఈ కాలంలో పిల్లలు అప్రమత్తంగా ఉండాలని, తల్లిదండ్రులు కూడా వారిపై పర్యవేక్షణ కొనసాగించాలని ఆయన తెలిపారు.

👉 విద్యార్థుల కోసం పలు ముఖ్యమైన సూచనలు వెల్లడిస్తూ, మధ్యాహ్నం 11 గంటల నుండి 4 గంటల వరకు ఎండలో తిరగకుండా ఉండాలని, డీహైడ్రేషన్ నివారించేందుకు ORS వంటి ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. బయటకు వెళ్లేటప్పుడు టోపీ లేదా గొడుగు ఉపయోగించడం మంచిదని పేర్కొన్నారు.

👉 అదేవిధంగా రోడ్డు భద్రత విషయంలో కూడా విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని, రోడ్డు దాటేటప్పుడు జీబ్రా క్రాసింగ్ ఉపయోగించడం, ట్రాఫిక్ నియమాలను పాటించడం అవసరమన్నారు. సైకిల్ లేదా బైక్ ఉపయోగించే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అని సూచించారు.

👉 నీటి వద్ద ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు పెద్దల పర్యవేక్షణ లేకుండా చెరువులు, కాలువలు, స్విమ్మింగ్ పూల్‌లలో ఈతకు వెళ్లకూడదని ఆయన హెచ్చరించారు.

👉 ఇక ఆన్‌లైన్ భద్రత విషయంలో విద్యార్థులు మొబైల్, ఇంటర్నెట్‌ను పరిమితంగా ఉపయోగించాలి, అపరిచితులతో ఆన్‌లైన్‌లో మాట్లాడకూడదని, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ పంచుకోకూడదని తెలిపారు.

👉వ్యక్తిగత భద్రత కోసం అపరిచితుల మాటలు నమ్మకూడదని, ఎక్కడికి వెళ్తున్నామో ఇంటివారికి తెలియజేయాలని, అత్యవసర నంబర్లు గుర్తుంచుకోవాలని సూచించారు. ఇంట్లో కూడా ప్రమాదకర వస్తువులకు దూరంగా ఉండాలని, ఎలక్ట్రిక్ పరికరాలు జాగ్రత్తగా వాడాలని, ఒంటరిగా ఉన్నప్పుడు తలుపులు సురక్షితంగా ఉంచాలని చెప్పారు.

👉 వేసవి సెలవులను సురక్షితంగా, ఆరోగ్యంగా గడపాలని విద్యార్థులకు శ్రీసిటీ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

2
67 views

Comment