logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ప్రజలు సంతృప్తి చెందే ద్యేయంగా వైద్య సేవలు అందించాలి


ప్రజల సంతృప్తి స్థాయి పెంచే లక్ష్యంగా వైద్య సేవలు అందించాలని జిల్లా ఎన్.సి.డి అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు పేర్కొన్నారు. బాగువలస, సాలూరు మెంటాడ వీధి ఆరోగ్య కేంద్రాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ నిర్దేశ ఆరోగ్య కార్యక్రమాల అమలవుతున్న వైద్య సేవలు, అందుతున్న తీరుపై పరిశీలించారు. రోగుల ఆరోగ్య తనిఖీ వివరాలు ఈహెచ్ఆర్ నమోదు పై తెలుసుకున్నారు. ఆరోగ్య సమస్యలు స్పష్టంగా తెలుసుకొని నమోదు చేయాలన్నారు. వ్యాధి నిర్ధారణ సకాలంలో జరుపుతున్నారా లేదా అని ల్యాబ్ నివేదికల రికార్డులు తనిఖీ చేశారు. ల్యాబ్ పరికరాల పనితీరుపై పరిశీలించారు
ఆరోగ్య పర్యవేక్షకులు ప్రజారోగ్యమే లక్ష్యంగా ప్రతీ కార్యక్రమము సజావుగా సాగే విధంగా కార్యాచరణ చేస్తూ పురోగతి సాధించేలా పర్యవేక్షణ చేయాలన్నారు. పిహెచ్సీ ప్రసవాలను మెరుగు పర్చుకోవాలన్నారు. మందులు,ఓఆర్ఎస్ లభ్యతపై తనిఖీ చేశారు. ఆసుపత్రి విడిచి వెళ్ళే ముందర సేవల సంతృప్తిపై ప్రతీ ఒక్కరిని అడిగి తెలుసుకోవాలన్నారు.
పురోహితునివలస లో సంచార చికిత్సా శిబిరాన్ని తనిఖీ చేశారు. దీర్ఘకాలిక రోగుల ఆరోగ్య పర్యవేక్షణ తీరుపై తెలుసుకున్నారు. సక్రమంగా మందులు వినియోగిస్తున్నారా లేదా అని వైద్య సిబ్బంది పర్యవేక్షించాలన్నారు. గ్రామస్తులతో మాట్లాడి వైద్య సేవలు అందుతున్న తీరుపై తెలుసుకున్నారు. వేసవి జాగ్రత్తలపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ ఎ. ప్రియాంక, డాక్టర్ వై. మధు, ఆరోగ్య పర్యవేక్షకులు నాగేంద్ర, నాగమణి, నారాయణరావు, వైద్య సిబ్బంది ఉన్నారు.

108
3010 views

Comment